చేయాలనుకునే పనికోసం టార్గెట్ , కష్టపడే తత్వం, కొంచెం అదృష్టం ఈ మూడు ఉంటే ఏరంగంలో అయినా ఖచ్చితంగా రాణించొచ్చు. చిత్ర పరిశ్రమలో ఒక యాంకర్‌గా ప్రయాణమైన ఆమె ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. భార్య, భర్త పనిచేసే విషయంలో పోటిపడితే ఎలా ఉంటుందో వారిద్దరిని చూసి చాలామంది నేర్చుకోవాలి. భర్త క్రియేటివ్ పార్ట్‌ను చూసుకుంటే భార్య అధ్బుతంగా పీఆర్ మెయింటైన్ చేస్తే ఏ కంపెనీ అయినా అద్భుతాలు చేస్తుంది అనటానికి సరైన ఉదాహరణ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ అధినేత ప్రవీణా కడియాల. నేడు ప్రవీణా పుట్టినరోజు. ఉద్యోగులుగా ప్రారంభమైన వారి ప్రయాణం సరిగ్గా 12 ఏళ్లక్రితం చిన్న ఎంటర్టైన్మెంట్ సంస్థగా స్టార్టయ్యింది. అక్కడినుండి ఏ షూటింగ్‌లు చేస్తే ప్రేక్షకులకు సరైన ఎంటర్టైన్మెంట్ను అందించవచ్చు వినూత్నమైన షోలను ఎలా ప్రజెంట్ చేయాలి అని భర్త అనిల్ కడియాలతో కలిసి నిరంతరం కృషి చేసేవారామె. వారు చేసే ప్రతి షో హిట్, బ్లాక్‌బస్టర్ అనే రేంజ్లో టీవి ఇండస్ట్రీలో జ్ఞాపిక పేరు మారుమ్రోగిపోయింది. ఆలస్యం చేయకుండా చిత్ర పరిశ్రమ వైపు వారి కన్నుపడింది. మంచి ఎమోషనల్ కంటెంట్‌ను ఎన్నుకుని కార్తికేయ హీరోగా ‘గుణ 369’ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాను వారి బ్యానర్లో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణా ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన గద్దర్ అవార్డ్సు బాధ్యతలను తమపై వేసుకుని అత్యంత వైభవంగా ఈవెంట్ నిర్వహించిన ఘనత జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ సొంతం చేసుకుంది. తెలుగు టీవి ప్రేక్షకులకు దాదాపు 20 పైగా షోలను అందించటంలో ప్రవీణా కడియాల కీలకపాత్ర పోషించారు. ట్యాగ్‌తెలుగు ప్రవీణా కడియాల జన్మదినం సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తుంది.
శివమల్లాల