Naveen Chandra: ‘లెవెన్’ సినిమా ట్విస్ట్‌లను డీకోడ్ చేయడం కష్టం

లోకేశ్ అజ్లీస్ దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఎ లెవెన్’. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా మే 16న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘‘సినిమాకి ‘లెవన్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం.. కథే. ఈ విషయం చూసినప్పుడు తెలుస్తుంది. తమిళ్‌లో షోస్ చూసిన వారు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పటి వరకూ ఏ థ్రిల్లర్‌లోనూ రాని ఒక డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్ ఆడియన్స్‌కి సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ప్రతిదానికి లాజిక్ ఉంటుంది.

ట్విస్ట్ లని డీకోడ్ చేయడం చాలా కష్టం. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ఓ కమర్షియల్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దీనికోసం నిర్మాతలు చాలా ఖర్చు చేశారు. ఈ సినిమా చూసిన వారంతా ముఖ్యంగా దర్శకుడితో పాటు రైటింగ్ గురించి మాట్లాడతారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేస్తే.. సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. నాకు తెలుగు, తమిళ్ బైలింగ్వల్ నాకు అడ్వాంటేజ్. నాకు ఎనిమిది భాషలు తెలుసు. వాటిలో తమిళ్ కూడా ఒకటి. దీంతో తమిళ్ చిత్రానికి సైతం నేనే డబ్బింగ్ చెప్పా. తొలినాళ్లలో ఒక క్యారెక్టర్ నుంచి బయటకు రావడం నాకొక పెద్ద సమస్య. షూటింగ్ మగించుకుని ఇంటికి వెల్లాక కూడా క్యారెక్టర్‌ను మోసుకెళ్లేవాడిని. ఆ తరువాత నన్ను నేను మార్చుకున్నా. షూటింగ్ తర్వాత క్యారెక్టర్‌ను స్విచ్చాఫ్ చేస్తా.

రవితేజతో నేను ‘మాస్ జాతర’ సినిమా చేస్తున్నా. ఈ సినిమాలో విలన్‌గా నన్ను రవితేజ గారు రిఫర్ చేయడంతో సితార నుంచి కాల్ వచ్చింది. ‘అరవింద్ సమేత’లో నా క్యారెక్టర్ ని ఎలా యూనిక్‌గా ఫీల్ అయ్యారో.. అంతే యూనిక్‌గా ఈ సినిమాలో ఉంటుంది. నేను చేసే ప్రతి సినిమాకు కనీసం 10 మంది ఆడియన్స్ అయినా పెరగాలని అన్ని రకాల పాత్రలూ చేస్తున్నా. కరుణ్ కుమార్‌తో చేస్తున్న ‘హనీ’ చిత్రం చాలా డార్క్ మూవీ. ఇప్పటి వరకూ చూడనంత కొత్తగా ఉంటుంది. అలాగే ‘కాళీ’ అనే యాక్షన్ సినిమా.. ఫస్ట్ టైం నా కెరీర్‌లో కామెడీ చిత్రం కూడా చేస్తున్నా’’ అని నవీన్ చంద్ర తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *