తమ్ముడు మూవీ రివ్యూ…

చిత్రం: తమ్ముడు
విడుదల తేది: 04-07-2025
నటీనటులు: నితిన్, సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా, స్వాసిక, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు.
దర్శకుడు: శ్రీరామ్ వేణు
ప్రొడ్యూసర్స్: దిల్ రాజు, శిరీష్
మ్యూజిక్: అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి

అక్కా, తమ్ముడు అనుబంధం గురించి చిత్రాలు చాలానే వచ్చాయి. చిన్నప్పుడే తల్లి మరణిస్తే తమ్ముడికి అమ్మలా మారి కంటికి రెప్పలా కాచుకున్న అక్కను.. తను పెరిగి పెద్దయ్యాక తమ్ముడు ఎలా చూసుకున్నాడు. ఆ అక్కా తమ్ముళ్ల కథ సాఫీగా సాగిపోయిందా? లేదంటే కష్టాల కడలిని దాటాల్సి వచ్చిందా? ఒకవేళ కష్టం వస్తే ఏ రూపంలో వచ్చింది? దానిని వారిద్దరూ ఎలా దాటారు? అన్నదే చిత్ర కథాంశం.

అక్క, తమ్ముళ్ళ కథ ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కాబట్టి కథ కొత్తగా ఉండాలి.. లేదంటే కథనం అయినా ఆకట్టుకునేలా ఉండాలి. ఇవి రెండూ లేని సినిమాయే తమ్ముడు. ఫస్ట్ హాఫ్ అంతా.. ఒక మూసివేసి వున్న ఫ్యాక్టరీ లో బ్లాస్ట్ జరగడం.. హీరో ఇంట్రడక్షన్.. అతని పర్సనల్ స్టోరీ చెప్పడం.. అక్కా తమ్ముళ్ళు ఎలా దూరమయ్యారు వంటి అంశాలతో నడుస్తుంది. అక్క ఇచ్చిన మాట కోసం తమ్ముడు ఏం చేశాడనేదే కథ. ఎక్కడా కథలో కొత్తదనం ఉండదు. మూవీ ఏం జరుగుతుందనేది ముందుగానే తెలుస్తూ ఉంటుంది.

ఎవరు ఎలా చేశారంటే..

జై పాత్రలో నితిన్ చక్కగా నటించాడు. ఝాన్సీ కిరణ్మయి పాత్రలో లయ ఆకట్టుకుంది. చిత్ర పాత్రలో వర్ష బొల్లమ్మ జీవించింది. సొరభ్ సచదేవ నటన కాస్త ఓవర్గా అనిపించింది. సప్తమి గౌడ, శ్వాసిక తమ పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నికల్ పరంగా మూవీ ఎలా ఉందంటే..

మ్యూజిక్ అయితే సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

ప్లస్..

నటీనటుల నటన

పాటలు

మైనస్..

కథ
కథనం
సాగదీత

ఫైనల్ వర్డిక్ట్..

ఏమాత్రం మెప్పించలేక పోయిన తమ్ముడు.

రేటింగ్.. 2/5

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *