‘థాంక్యూ డియర్’కు తమ్మారెడ్డి సపోర్ట్

టాలీవుడ్‌లో యువ కథానాయకుడు ధనుష్ రఘుముద్రి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థాంక్ యూ డియర్’.ఈ సినిమాకు ప్రముఖ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన వంతు సహకారం అందించారు. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్‌ను తమ్మారెడ్డి విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌ను చూసిన తమ్మారెడ్డి, చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ సినిమా ధనుష్‌కు మంచి గుర్తింపు తెస్తుందన్నారు. యువ బృందానికి ఆశీస్సులు అందజేస్తూ.. సినిమా ఘన విజయం సాధించాలని కోరారు. ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ.. ‘థాంక్ యూ డియర్’ తన రెండో చిత్రమని, తమ్మారెడ్డి లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ తమ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందన్నారు. నిర్మాత పప్పు బాలాజీ రెడ్డి మాట్లాడుతూ.. ఈ చిత్రం ధనుష్‌కు గొప్ప పేరు తెస్తుందన్నారు. తమ్మారెడ్డి లాంటి ప్రముఖులు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం తమకు ప్రోత్సాహకరంగా ఉందన్నారు. ఈ సినిమాలో హెబా పటేల్, రేఖ నిరోషా, వీర శంకర్ , నాగ మహేష్ , రవి ప్రకాష్ , ఛత్రపతి శేఖర్ , బలగం సుజాత , సంక్రాంతి ఫేమ్ – శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *