‘ఓదెల 2’ సినిమాలో తమన్నా తన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన పాత్రలకు పూర్తిగా భిన్నంగా కనిపించనుంది.
సాధారణంగా గ్లామర్ పాత్రలతో అలరించిన ఆమె, ఈసారి అఘోరిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ చిత్ర టీజర్ మహా కుంభ మేళా సందర్భంగా వారణాసిలో విడుదలైంది. 1.52 నిమిషాల నిడివి గల ఈ టీజర్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఆకట్టుకుంటోంది.
ఒక మంచి మనిషి, ఓ ఆత్మ మధ్య జరిగే కథగా ఈ చిత్రం రూపొందినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది.
తమన్నా నాగ సాధువు పాత్రలో కనిపిస్తుండగా, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.
విజువల్స్ ప్రభావం బాగా కనిపించగా, మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లింగ్ వాతావరణాన్ని సృష్టించింది.
అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంపత్ నంది రచనా సహకారం అందించగా, డి. మధు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
ఈ చిత్రం, నాలుగేళ్ల క్రితం విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.
ఇంటెన్స్ యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం ‘అరుంధతి’ వంటి సినిమాలను గుర్తు చేసే విధంగా ఉందని టీజర్ ద్వారా అర్థమవుతోంది. మొత్తంగా, ‘ఓదెల 2’ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
సంజు పిల్లలమర్రి