మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు ‘విశ్వంభర’ షూటింగ్‌ను నిర్వహిస్తూనే మరోవైపు అనిల్ రావిపూడితో సినిమాను మొదలు పెట్టేశారు. ఇక లీకువీరులు ఏ సినిమాను వదలరు కదా.. అలాగే అనిల్ రావిపూడితో సినిమా విషయంలోనూ లీక్స్‌కు తెరదీశారు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో భాగంగా ఒక సీన్‌ను చిత్రీకరిస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సీన్ ఏంటి అంటారా? నీటిలో పడవపై మెగాస్టార్, నయనతార కూర్చొని ఉండగా పెల్లి సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్టుగా ఉంది.
మరి ఇలాంటి వాటిని లీక్ చేస్తే చిత్ర యూనిట్, మెగాస్టార్ చూస్తూ ఊరుకుంటారా? లీకువీరులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘మెగా 157’ సెట్స్ నుంచి వీడియోలు, ఫోటోలు అనథరైజ్‌డ్‌గా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిని మేము సీరియస్‌గా పరిగణిస్తున్నాం. మా సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను సెట్స్ నుంచి షేర్ చేయవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం. వ్యక్తిగతంగా కానీ.. ఏ ప్లాట్‌ఫామ్ నుంచి అయినా.. లీక్‌డ్ మెటీరియల్ షేర్ చేసినట్టుగా కానీ.. అప్‌లోడ్ చేసినట్టుగా కానీ మా దృష్టికి వస్తే స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకుంటాం’’ అని మేకర్స్ ఒక ప్రకటన ద్వారా హెచ్చరించారు.
ప్రజావాణి చీదిరాల