డేట్‌ ఫిక్స్‌ అంటున్న జక్కన్న? నిజమెంత అంటున్న నెటిజనులు…

మరో రెండేళ్లలో మహేశ్, రాజమౌళిల సినిమా చూపిస్తారట..నమ్మొచ్చా?
డేట్‌ ఫిక్స్‌ అంటూ వచ్చిన వార్తల్లో నిజమెంత?
టాలీవుడ్‌ స్మార్ట్‌ హీరో ప్రిన్స్‌ మహేశ్‌బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కే ప్రిస్టేజియస్‌ సినిమాని ఎస్‌ఎస్‌యంబి29గా పిలుచుకుంటున్న సంగతి తెలిసిందే. వారి కలయికలో వస్తున్న సినిమాకి సంబంధించిన ఏ న్యూసైనా చిన్న ఫోటో అయినా వైరల్‌ అవుతున్నాయి. ఆస్కార్‌ అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావటంతో ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా 2027 మార్చి 25న విడుదలవుతున్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే అప్పటికి ఆరోజుకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తవుతుందట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా అదే రోజున విడుదలై ప్రపంచంలోని సినిమా లవర్స్‌ అందరికి నచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఆ సెంటిమెంట్‌ను బేస్‌ చేసుకుని సినిమాను మార్చి 25న ప్రేక్షకులముందుకు తీసుకువస్తారట రాజమౌళి అండ్‌ టీమ్‌. మొత్తానికి మహేశ్‌ రాజమౌళి బోనులో నుండి 2027లో విడుదలవుతారన్నమాట. ఆ తర్వాత నుండైనా మహేశ్‌ సినిమా మీద సినిమా చేస్తాడా లేదా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే….
శివమల్లాల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *