SSMB 29 :
దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB 29 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్‌కు సంబంధించిన నటుల ఎంపిక, లోకేషన్స్ ఎంపిక వంటి పనులు జరుగుతున్నాయి. మహేష్ బాబు లుక్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
అయితే, ఈ సినిమా విషయంలో ఇటీవల జరుగుతున్న ఓ వార్త చిత్ర నిర్మాత కేఎల్ నారాయణను స్పందించేలా చేసింది. ఓ ప్రముఖ ఆంగ్ల వార్తా పత్రిక రాజమౌళి, మహేష్ బాబు సినిమాకు ‘గతంలో అపరిచితుడు’, ‘1 నేనొక్కడినే’ చిత్రాలకు పని చేసిన ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ వీరెన్ స్వామిని తీసుకున్నట్లు ప్రచురించింది. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
ఈ వార్త సినిమా మేకర్స్ వద్దకు చేరడంతో దుర్గా ఆర్ట్స్ నిర్మాత నారాయణ స్పందించారు. “ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ తీసుకోలేదని, ప్రస్తుతం ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నామని” నారాయణ తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటిస్తామని, అప్పటివరకు సినిమా గురించి అసత్య ప్రచారాలు చేయొద్దని ఆయన కోరారు.
SSMB29 సినిమాలో మహేష్ బాబు సరసన ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ చిత్రం 2025లో విడుదల కానుందని భావిస్తున్నారు.
Also Read This : ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 31 ఫస్ట్ లుక్