యంగ్ హీరోయిన్ శ్రీలీల వరుస సినిమాలతో దూసుకెళుతోంది. అమ్మడికి ఇటీవలి కాలంలో కాస్త ఫ్లాప్స్ వచ్చినా కూడా తిరిగి ‘జూనియర్’ సినిమాతో లైన్‌లోకి వచ్చేసింది. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం అయితే జోరుగానే సాగుతోంది. దీనికి కారణం.. వీళ్లిద్దరూ కలిసి పని చేస్తుండటమే. అయితే దీనిపై తాజాగా శ్రీలీల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది. తనకు ప్రేమలో పడే అవకాశమే లేదని.. తాను లవ్‌లో ఉన్నానని అంతా అనుకుంటున్నారని చెప్పుకొచ్చింది.
ఇక లవ్‌లో పడే ఛాన్స్ లేదని.. దానికి కారణం కూడా వెల్లడించింది. ప్రతిసారి తనతో తన తల్లి ఉంటుందని.. చివరకు మియామీ వెళ్లినప్పుడు కూడా తన తల్లి తనతోనే ఉందని.. అలాంటప్పుడు తానెలా ప్రేమలో పడగలనని తిరిగి ప్రశ్నించింది. ఈ ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితం ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు పెళ్లికూతురిలా ముస్తాబై కనిపించింది. దీనిని చూసిన నెటిజన్లు అమ్మడికి పెళ్లి ఫిక్స్ అనుకున్నారు. అయితే ఆ రోజు తన పుట్టిన రోజని.. అలా బుట్టలో తనను తీసుకెళ్లడం తమ కుటుంబ సంప్రదాయమని చెప్పింది. మొత్తానికి నెటిజన్లు అయితే రిలాక్స్ అయ్యారు కానీ పుట్టినరోజు నాడు ఇలా బుట్టలో తీసుకెళ్లే సంప్రదాయమేంటో.. మొత్తానికి తనకు 30 ఏళ్లు వస్తే కానీ పెళ్లి చేసుకోనని శ్రీలీల తెగేసి మరీ చెప్పింది.