సూపర్ స్టార్ మోహన్ లాల్ మలయాళంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నారు . ఆయన త్వరలోనే విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‘కన్నప్ప’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇవాళ మోహన్ లాల్ పుట్టిన రోజు (మే 21) సందర్భంగా కన్నప్ప నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మోహన్‌లాల్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ఆయన దైవిక భక్తితో ముడిపడిన కిరాత అనే పాత్రను చేశారు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
ప్రజావాణి చీదిరాల