ఐకాన్‌స్టార్‌కి 22 ఏళ్లు….

రెండవసినిమా ‘ఆర్య’తో అగ్రహీరోల జాబితాలోకి…

ఆరోజు నుండి ఈరోజు వరకు అదే కష్టం…అదే శ్రమ…
ఫెయిల్యూర్స్‌ వచ్చిన సక్సెస్‌లు ఆకాశాన్నంటిన ఒకేలా ఉండే తత్వం…అందానికి పాస్‌ మార్కులు కూడా పడవు అన్నవాళ్లతోనే అదే నోళ్లతో స్టైలిష్‌స్టార్, ఐకాన్‌ స్టార్‌….అనే బిరుదులు సొంతం చేసుకున్నాడు….
పిచ్‌లో స్ట్రాంగ్‌గా నిల్చోవటం నేర్చుకుంటే ఆట దానంతట అదే వస్తుంది. ఏ రంగంలో రాణించాలన్నా దానికి తగ్గ ప్రాక్టీస్‌ తప్పనిసరి. అలాంటి ప్రాక్టీస్‌ నటన కోసం అవసరమైనప్పుడు తనను తాను సమర్పించుకునే కళామతల్లి ముద్దుబిడ్డ ఎవర్‌గ్రీన్‌ హార్డ్‌వర్కర్, నేషనల్‌ అవార్డు విన్నర్‌ అల్లు అర్జున్‌. తను ఖచ్చితమైన పర్‌ఫెక్షనిస్ట్‌. అందుకే తన సినిమాల్లో ఒక స్టైల్‌ ఉంటుంది. ఏ పని చేసినా సిన్సియర్‌గా చేయటంతో విజయం తనంతట నడిచి వచ్చి అర్జున్‌పై ఫోకస్‌ లైట్స్‌వేసి మరి ప్రపంచానికి అతని టాలెంట్‌ను చూపించింది. అల్లు అర్జున్‌ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి 22 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్పెషల్‌ ఆర్టికల్‌…
విజయమనేది ఏ ఒక్కర్ని రాత్రికి రాత్రే వరించదు. తన బలము, బలహీనతలను బేరిజు వేసుకుని, జయపజయాలను సమానంగా స్వీకరిస్తూ, ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో శ్రమించే వ్యక్తులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆత్మవిశ్వాసంతో, సంకల్పంతో సాధించలేనిది ఏమీ లేదు అని నిరూపిస్తారు. సరిగ్గా పైన చెప్పిన విషయాలు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ విషయంలో అక్షర సత్యాలు. ఈ రోజు ఆయనకు ఐకాన్ స్టార్ అనే కిరీటం, ప్రపంచస్థాయి గుర్తింపు, ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు.. ఇవన్నీ రాత్రికి రాత్రే వరించలేదు.. దీని వెనుక 22 ఏళ్ల పట్టుదల, ఆత్మవిశ్వాసం, అనుకున్నది సాధించాలనే తపన అతన్ని కార్యోన్ముఖుడిని చేసింది. ’గంగోత్రి’ సమయంలో ఆయన ఓ సాధారణ హీరో.. ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపుతో పాటు భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచాడు. ’పుష్ప–2– చిత్రంతో భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పి విజయపథంలో దూసుకెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ తొలచిత్రం ’గంగోత్రి’ విడుదలై నేటికి 22 ఏళ్లు… అంటే నటుడిగా ఐకాన్ స్టార్ 22 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు…

గంగోత్రి సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన అల్లు అర్జున్, తనపై వచ్చిన విమర్శలను సవాల్‌గా తీసుకున్నాడు.. మలిచిత్రం ’ఆర్య’లో తన మేకోవర్‌తో అందర్ని ఆశ్చర్యపరిచాడు. ఆ చిత్రంలో వ¯Œ సైడ్‌ లవర్‌ ఆర్యగా ఆయన నటనకు వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఈ చిత్రమే ఆయన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ నిలిచింది. ఇక సినిమా సినిమాకు ఇంతింతయు, నటుడింతయి అన్న చందాన తన స్టార్‌డమ్‌ను పెంచుకుంటూ ఎవరూ ఊహించని ఉన్నతస్థానంలో నిలిచాడు. ఈ రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ అంటే క్రేజీ పాన్‌ ఇండియా స్టార్, ఆయన డేట్స్‌ కోసం బాలీవుడ్‌లో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు, దర్శకులు వెయిట్‌ చేస్తున్నారంటే ఆయన క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అల్లు అర్జున్ ఆర్య–2, పరుగు, బన్నీ,హ్యపీ, వంటి కమర్షియల్‌ సినిమాల మధ్యలో ’వేదం’ వంటి కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలో నటించి నటుడిగా మరో మెట్టు ఎదిగాడు. గోన గన్నారెడ్డి వంటి చరిత్ర యోధుడి పాత్రలో నటించి ఇలాంటి పాత్రలు కూడా తాను చేయగలనని నిరూపించుకున్నాడు. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటి సారి సిక్స్‌ ప్యాక్‌ బాడీ చూపించిన హీరోగా ’దేశ ముదురు’లో కనిపించి అందరిని సంభ్రమశ్చర్యాలకు గురిచేశాడు. అప్పట్లో ఆయన సిక్స్‌ ప్యాక్‌ హాట్‌టాపిక్‌గా మారింది. డీజే దువ్వాడ జగన్నాథం, బద్రీనాథ్‌ చిత్రల్లో వైవిధ్యమైన పాత్రలో మెప్పించి అల్లు అర్జున్ ఏ సినిమా చేసిన ఆ పాత్రలోకి ఒదిగిపోయేవాడు. ఇద్దరమ్మయిలతో, నా పేరు సూర్య వంటి చిత్రాలతో మెప్పించిన ఈ ఐకాన్ స్టార్ సరైనోడు, రేసుగుర్రం చిత్రాలతో కమర్షియల్‌ చిత్రాల పవర్‌ ఏమిటో నిరూపించాడు. ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఆయన నటించిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురం చిత్రాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి.

 

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నటించిన మొదటి రెండు చిత్రాలు కమర్షియల్‌గా మంచి విజయాలు సాధించడమే కాకుండా, నటుడిగా ఆయన స్థాయిని పెంచాయి. అల వైకుంఠపురం చిత్రాన్ని పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల వారిని అలరించడమే కాకుండా వసూళ్లలో తెలుగు సినీమా చరిత్ర రికార్డును తిరగరాసింది.ఇక ఆర్య చిత్రంతో ఆయన కెరీర్‌ను టర్న్‌ చేసిన దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ ను పుష్ప చిత్రంలో పుష్పరాజ్‌గా ఓ చరిత్రను తిరగరాసే పాత్రను సష్టించాడు. ఆ పాత్రలో ఆయన నటించిన విధానంతో ఇండియా లెవల్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు సంపాందించుకున్నాడు. పాన్‌ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రంలో తన నటనకు ఉత్తమ నటుడిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ జాతీయ అవార్డను అందుకున్నాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని గౌరవం దక్కించుకున్నాడు. ఇక ఇటీవల ’పుష్ప–2లో ఆయన నటనకు ప్రపంచమంతా ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప–2 రికార్డులు సాధించింది. అంతేకాదు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్‌ చేసిన సంగతి తెలిసింది. అంతేకాదు ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అసామాన్య నటనా ప్రతిభకు త్వరలోనే మరిన్ని అవార్డులు కైవసం చేసుకుంటాడని సినీ విశ్లేషకులు చెబుతున్నారు..

 

Also Read This :ఏప్రిల్ 11 న సంపూర్ణేష్ బాబు, సంజోష్ మూవీ ‘సోదరా’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *