ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు నిర్మిస్తున్న సినిమా ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. జయశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి శనివారం ‘భగ భగ..’ అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు.
ఈ పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేయగా వనమాలి లిరిక్స్ అందించారు. ‘మనిషేనా నువ్వు.. ఏమైపోతున్నావు.. మృగమల్లె మారి దిగజారి పోయావు.. భగ భగ భగ భగ మండే నీలో ఏదో సెగ.. అంతులేని ఏంటి దగా..’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో వినోద్ వర్మ, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ‘కౌసల్య తనయ రాఘవ’