...

సిద్దుని నమ్మి సీన్ చెప్పి కళ్లు మూసుకుంటే చాలు: బొమ్మరిల్లు భాస్కర్

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో రూపొందిన చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’.

ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మించింది.

ఈ సినిమాలో సిద్దు సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది.

ఈ మూవీ ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలోనే శుక్రవారం టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ ఈవెంట్‌లో

సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ : ‘బొమ్మరిల్లు భాస్కర్ గారు జాక్ కథను చెప్పినప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యాను.

ఇది చాలా పెద్ద కథ. పైకి కనిపించేది కాదు.. లోపల చాలా ఉంటుంది.

భాస్కర్ గారు జానర్ మార్చడం వల్ల జాక్ చాలా కొత్తగా అనిపిస్తుంది.

టిల్లు అనేది కారెక్టరే బేస్డ్ సినిమా అయితే.. జాక్‌లో కారెక్టర్‌తో పాటు అదిరిపోయే కథ కూడా ఉంటుంది.

ఇంటర్వెల్‌లో వచ్చే ఛార్మినార్ ఎపిసోడ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. జాక్ ఐడియానే అద్భుతంగా ఉంటుంది.

ఆ ఐడియా నుంచి వచ్చిన సీక్వెన్స్ ఇంకా బాగుంటాయి. భాస్కర్ గారు ఈ సినిమా కోసం దగ్గరదగ్గరగా రెండేళ్లు పని చేశారు.

రొటీన్ యాక్షన్ సినిమాలా ఉండదు. చాలా రేసీగా ఉంటుంది.

జాక్ అనేది నిజంగానే క్రాక్ లాంటి పాత్ర. చాలా ట్విస్టులు ఉంటాయి.

స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న రాబోతోంది.

అందరినీ అలరించేలా మా సినిమా ఉంటుంది’ అని అన్నారు.

బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ : ‘బీవీఎస్ఎన్ ప్రసాద్ గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉంది.

బాపీ నాకు మంచి స్నేహితుడు.

ఒకసారి జాక్ పాయింట్ ఆయనకు చెప్పాను. వెంటనే సిద్దుతో మీటింగ్ జరగడం, ఒక్కరోజులోనే ప్రాజెక్ట్ సెట్ అవ్వడం జరిగింది.

సిద్దు లాంటి నటుడితో పని చేయడం ఏ దర్శకుడికైనా చాలా సులభం.

సిద్దుని నమ్మి సీన్ చెప్పి కళ్లు మూసుకుంటే చాలు. ఆ సీన్ అద్భుతంగా వస్తుంది.

రైటింగ్ స్టేజ్ నుంచే సిద్దు చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. జాక్ థీమ్ మాత్రమే నేను రాశాను.

జాక్ కారెక్టరైజేషన్, డైలాగ్ మాడ్యులేషన్‌లో సిద్దుకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను.

ప్రతీ ఒక్కరిలోనూ జాక్ ఉంటాడు. ఆ జాక్ ఎవరు? అనేది ఎవరిది వాళ్లే తెలుసుకోవాలి.

ఈ సినిమా నా స్టైల్లోనే ఉంటుంది’’ అన్నారు.

వైష్ణవి చైతన్య మాట్లాడుతూ : ‘బొమ్మరిల్లు భాస్కర్ గారి దర్శకత్వంలో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం.

చిన్నప్పుడు ఆయన పాటలకు వైబ్ అవుతుండేదాన్ని.

అలాంటి స్థాయి నుంచి ఈ రోజు ఆయన సినిమాలో నటించడం, ఆయన పాటల్లో కనిపించడమే నా సక్సెస్’’ అని తెలిపింది.

నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ : ‘‘బొమ్మరిల్లు భాస్కర్‌తో మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది.

ఆయన దర్శకత్వంలో సిద్దు హీరోగా జాక్ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది.

ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నా’’ అని అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Also Read This : జార్జియాలో రెండు సార్లు రిజెక్ట్ చేశారు: నవీన్ చంద్ర

Rajendraprasad Interview
Rajendraprasad Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.