కార్తీక్ రాజు, శ్రీవిష్ణు కాంబోలో రూపొందిన చిత్రం ‘సింగిల్’. ఈ సినిమాలో కేతిక శర్మ, ఇవానా కీలక పాత్రలు పోషించారు.
గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలింస్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం వేసవి కానుకగా మే 9న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఒక్కో అప్‌డేట్‌ను విడుదల చేస్తూ చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది.
ఈ క్రమంలోనే రొమాంటిక్ మెలొడి ఫస్ట్ సింగిల్ ‘శిల్పి ఎవరో’ రిలీజ్ చేశారు.
శ్రీ విష్ణు తన జీవితంలోని ఇద్దరు స్పెషల్ అమ్మాయిలు కేతిక శర్మ, ఇవానా అందాన్ని పొగుడుతూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది.
‘ఏఐ కూడా ఊహించలేదుగా.. ఇంతందాన్ని ఏం చెప్పినా.. ఏమై ఫాలింగ్ ఇన్ టు ద లవ్ అని స్టేటస్ పెట్టనా?’ అంటూ సాగే ఈ పాట లిరిక్స్ యూత్‌ను
ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. విశాల్ చంద్ర శేఖర్ అందించిన సంగీతం ఈ పాటకు ప్లస్ అనే చెప్పాలి.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ‘చౌర్యపాఠం’ సాంగ్ రిలీజ్ చేసిన వరుణ్ తేజ్