సమీక్ష : జీబ్రా
విడుదల తేది : 22-11-2024
నటీనటులు : సత్య దేవ్, ధనంజయ, ప్రియా భవాని శంకర్, సత్య, సత్య రాజ్, సునీల్
ఎడిటర్ : అనిల్ క్రిష్
సినిమాటోగ్రఫీ : సత్య పోన్‌మార్
సంగీతం : రవి బస్రూర్
నిర్మాత : ఎస్.ఎన్ రెడ్డి, బాల సుందరం, దినేష్ సుందరం
కథ- దర్శకత్వం : ఈశ్వర్ కార్తిక్
కథ :
సత్యదేవ్ హీరోగా, ధనంజయ్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రం జీబ్రా. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ఇవాళ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది.
ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం….
జీబ్రా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. డబ్బుని కూడా బ్లాక్ అండ్ వైట్ రూపాల్లో మనం రోజూ మాట్లాడుతూ ఉంటాము.
సత్యదేవ్ డాలీ ధనుంజయ్ నువ్వా నేనా అన్నట్లు నటుంచారు.
నటీనటుల పనితీరు :
సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ తో ఇరగదీస్తాడు అని ప్రిపేర్ అయ్యి థియేటర్ కి వెళ్తే, డాలీ ధనంజయ్ తన పెర్ఫార్మన్స్ తో అదరగొడతాడు .
డాలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “పుష్ప”లో సైడ్ విలన్ గా మాత్రమే చూపించగా, ఈ సినిమాలో హీరో కంటే పవర్ ఫుల్ రోల్లో చూపించారు.
ఒక్కోసారి సినిమాలో హీరో డాలీ ఏమో అనిపిస్తుంటుంది. అతడి ఎలివేషన్ సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ వేరే లెవల్లో ఉన్నాయి.
మాస్ ఆడియన్స్ ఈ సినిమాలో అందరికంటే ఎక్కువగా డాలీ క్యారెక్టర్ కు కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు.
సత్యదేవ్ ఏమాత్రం తగ్గకుండా పెర్ఫార్మ్ చేశాడు. సూర్య పాత్రకి చాలా ఫాస్ట్ మరియు యాక్టీవ్ గా ఉండాలి .
సత్యదేవ్ ఆ పాత్రలో జీవించేశాడు.కమెడియన్ సత్య తనదైన కామెడీ టైమింగ్ తో మరోసారి హైలైట్ అవ్వడమే కాగా సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాడు.
సత్యరాజ్ టైమింగ్ తో అలరించగా, సునీల్ కాస్త డిఫరెంట్ రోల్లో ఆకట్టుకున్నాడు. ప్రియ భవానీ శంకర్, జెన్నిఫర్ గ్లామర్ యాడ్ చేశారు.
మిగతా నటీనటులందరూ వాళ్ళ పాత్ర లో బాగా నటించారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నారేషన్ తో నడిచిన సెకండ్ హాఫ్ మాత్రం ఇట్టే అయిపోతుంది.
ఫైనల్ వర్డిక్ట్ :
మొత్తం మీద ఈ సినిమా అయితే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ తో సత్యదేవ్ హిట్ కొట్టాడు అని చెప్పొచ్చు….
రేటింగ్ : 3/5
శివమల్లాల
Also Read This : దేవకీ నందన వాసుదేవ రివ్యూ