Sankranti 2024:
మన తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి ఏడాది సంక్రాంతికి పలు సినిమాలు రిలీజ్ అయి అందరినీ అలరిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంటాయి. అదే విధంగా రానున్న 2024 సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ డేట్స్ ని ఫిక్స్ చేసుకున్నాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్
వాటిలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గుంటూరు కారం, కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నూతన దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ మూవీ నా సామిరంగ,
విక్టరీ వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను తెరెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ సైంధవ్,
మాస్ మహారాజా రవితేజ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఈగల్,
అలానే తేజ సజ్జ హీరోగా యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ తీస్తున్న పాన్ ఇండియన్ మూవీ హను మాన్.
అయితే వీటితో పాటు కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ అయలాన్, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా రూపొందుతున్న కెప్టెన్ మిల్లర్ కూడా సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి.
రవితేజ ఈగిల్
అయితే ఒక్కసారిగా ఇన్ని సినిమాలు బాక్సాఫీస్ బరిలో సందడి చేయనుండడంతో వీటి మధ్య థియేటర్స్ కేటాయింపుల సమస్య తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.
నిజానికి ఈ విషయమై కొన్నాళ్లుగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మన తెలుగు సినిమాల నిర్మాతలతో ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు.
అయితే మన టాలీవుడ్ లోని సంక్రాంతి రిలీజ్ కి సిద్దముగా ఉన్న ఐదు సినిమాల్లో ఒకటి తప్పుకుంటుందని కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
కాగా పక్కాగా వీటిలో ఒక మూవీ మాత్రం సంక్రాంతి బాక్సాఫీస్ క్లాష్ నుండి తప్పుకోవడం ఫిక్స్ అయిందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.
ఇక తాజా అప్ డేట్ ప్రకారం రవితేజ ఈగిల్ మూవీ ఈ క్లాష్ నుండి తప్పుకుని జనవరి 26 న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు.
ఈగిల్ మూవీ సంక్రాంతి 2024 బాక్సాఫీస్ క్లాష్ నుండి తప్పుకుంటుందా
అయితే మొదటి నుండి ఈ మూవీకి మిగతా మూవీస్ తో పోల్చుకుంటే ఒకింత లోబజ్ ఉండడమే అందుకు కారణం అంటున్నారు.
మరి నిజంగానే రవితేజ ఈగిల్ మూవీ సంక్రాంతి 2024 బాక్సాఫీస్ క్లాష్ నుండి తప్పుకుంటుందా లేదా అనే దాని పై ఆ మూవీ మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రావాల్సి ఉంది.
మరోవైపు తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ ని వాయిదా వేయొద్దని, తప్పకుండా రిలీజ్ చేస్తే మూవీ మంచి సక్సెస్ దక్కించుకుంటుందని పలువురు రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.
ఒక్కసారిగా సంక్రాంతికి ఇన్ని సినిమాలు వస్తుండడం వల్లనే ఒకరిద్దరు తప్పుకుంటే తప్ప ఈ పరిస్థితి సెట్ కాదని అందుకే ఈగిల్ వాయిదా పడిల్సి వస్తోందని తెలుస్తోంది. మరి ఈ విషయమై ఈగిల్ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూద్దాం.