ప్రముఖ నటి సమంత నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్‌పై తీసిన తొలి చిత్రం ‘శుభం’. ఈ సినిమా మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంతా కొత్తవారే నటించారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, షాలినీ కొండెపూడి, వంశీధర్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మే 9వ తేదీన విడుదలై సక్సెస్ ఫుల్‌గా రెండో వారంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో నటి, నిర్మాత సమంత మాట్లాడుతూ .. ‘‘ కేవలం పది శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానా అనేది ఇప్పుడు తెలుస్తోంది. ఈ మూవీకి పని చేసిన ప్రతి ఒక్కరి మొహంలో సంతోషం కనిపించడమే సక్సెస్‌గా భావిస్తున్నా. నాకు ఈ మూవీ చూస్తే నా సమ్మర్ హాలీడేస్ గుర్తుకు వచ్చాయి. మేము ముగ్గురు పిల్లలం. మమ్మల్ని సినిమాలకు తీసుకు వెళ్లేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఈ సినిమాతో అందరినీ తిరిగి పాత రోజులకు తీసుకెళ్లాం. నటిగా ఉంటే లాస్ట్ వచ్చి ఫస్ట్ వెళ్లిపోతాం. వస్తాం.. ఫస్ట్ వెళ్లిపోతాం. హీరోయిన్‌గా ఉన్నప్పుడు కేవలం నా పాత్ర గురించే ఆలోచించిన నేను నిర్మాతగా మారాక అసలు కష్టాల్ని తెలుసుకున్నా’’ అని చెప్పుకొచ్చింది. అని అన్నారు.
దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ .. ‘‘వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పీచ్ ఇచ్చాక సినిమా ఆడకపోయి ఉంటే నా మీద చాలా మీమ్స్ వేసేవాళ్లని భయం వేసింది. మూవీ మీదున్న నమ్మకంతోనే ఆ రోజు అలా మాట్లాడాను. నా డైరెక్షన్ టీంలోని ప్రతి ఒక్కరూ.. తప్పులుంటే మొహం మీదే చెబుతుంటారు. వారి వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ‘పాలు నీళ్ల బంధం’ అభి రాశాడు. ఈ మూవీ జనాల్లోకి వెళ్లడానికి కారణం సమంత గారు. ఆమె వల్లే ఈ మూవీ జనాల్లోకి వెళ్లింది. సమంత గారు లేకపోతే ఈ మూవీని ఎవరు చూస్తారు? సమంత గారి వల్లే ఈ మూవీ జనాల్లోకి వెళ్లింది’’ అని తెలిపారు.
ప్రజావాణి చీదిరాల