Samantha PA :
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు, ఎవరు, ఎలా ఏ రూపంలో దర్శనమిస్తారో అస్సలు ఊహించలేము.
అలాంటి సంఘటనలు కోకొల్లలు. ఈ రోజు హీరోయిన్ సమంత తన అసిస్టెంట్ ఆర్య గురించి సోషల్ మీడియా ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టింది.
ఆ పోస్ట్ సారాంశమేంటంటే తనతో 15 ఏళ్లుగా జర్నీ చేస్తున్న ఆర్యను ‘లిటిల్‌బాయ్ టు లైన్ ప్రొడ్యూసర్…’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో తెలిపింది.
ఈ 15 ఏళ్లే కాదు, లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే ఉంటావు అని కూడా పోస్ట్‌లో అన్నారు సమంత.
త్రలయ మూవీస్‌కి లైన్ ప్రొడ్యూసర్‌గా నీ ఎదుగుదల చూసి గర్వంగా ఫీలవుతున్నా డియర్ ఆర్యన్ దగ్గుబాటి అంటూ సమంత సోషల్ మీడియా పోస్ట్ పెట్టి…
తన దగ్గర పనిచేసిన అతనికి ఎంతో గొప్ప పేరు రావాలని కోరుకోవటంతో సమంతని అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
శివమల్లాల
Also Read This : సెంట్రల్ మినిస్టర్ కొడుకు సినిమాల్లోకి రావడానికి కారణం ?