...

Samantha: కొన్ని కోట్ల విలువ చేసే యాడ్స్ వదులుకుందట.. కారణం తెలిస్తే..

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని నటులంతా భావిస్తారు. కానీ సమంత దీనికి విరుద్ధంగా ఉంది. అంటే ఆమేమీ సంపాదించుకోలేదని కాదు కానీ.. డబ్బొస్తుంటే ఎవరు కాదనుకుంటారు? ఇంకా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. డబ్బులో ఉన్న మ్యాజిక్కే అది. కానీ సమంత మాత్రం ఆరోగ్యం, ప్రశాంతతకు ప్రాధాన్యమిస్తోంది. నచ్చితే యాక్ట్ చేస్తోంది. లేదంటే సైలెంట్. చక్కగా ఇన్‌స్టాలో వ్యక్తిగత సంరక్షణ, మహిళా సాధికారిత వంటి అంశాలపై సందేశాలిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మెంటల్ హెల్త్, అడ్వర్‌టైజ్‌మెంట్ వంటి అంశాలపై చర్చిస్తూ ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపింది. తాను కొన్ని కోట్ల విలువ చేసే యాడ్స్ వదులుకున్నట్టు తెలిపింది. దీనికి సమంత చెప్పిన కారణం వింటే ఆమెపై గౌరవం రెట్టింపవుతుందనడంలో సందేహం లేదు.

‘‘20 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. అప్పట్లో సక్సెస్‌కు డెఫినేషన్ మరోలా ఉండేది. మన సక్సెస్ అనేది ఎన్ని ప్రాజెక్టులు చేశాం, ఎన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నామనేదానిపైనే సక్సెస్‌ను కాలిక్యులేట్ చేసేవారు. ఆ సమయంలో నేను ఎన్నో మల్టీనేషనల్‌ బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం నాకు గొప్పగానూ.. ఆనందాన్నిచ్చేది. కానీ ప్రస్తుతం చాలా విషయాలపై నాకు అవగాహన వచ్చింది. ఉత్పత్తులను ప్రమోట్ చేసేటప్పుడు బాధ్యతగా ఉండాలని తెలుసుకున్నా. ఆ తర్వాత ఏ బ్రాండ్‌కు పడితే దానికి అంబాసిడర్‌గా ఉన్నందుకు నాకు నేనే క్షమాపణ చెప్పుకున్నా. ఆ తరువాత కోట్లలో డబ్బు ఇస్తానని వచ్చినప్పటికీ గడిచిన ఏడాదిలోనే సుమారు 15 బ్రాండ్స్‌ వదులుకున్నా. కేవలం నా వద్దకు వచ్చే ఉత్సత్తులను తెలిసిన వైద్యులతో పరిశీలింపజేసి.. వాటి కారణంగా సమాజానికి ఎలాంటి హాని కలగదని నిర్ధారించుకున్న మీదటే ఆ యాడ్‌ను అంగీకరిస్తున్నా’’ అని సమంత తెలిపింది. ఈ విషయం సమంత ఫ్యాన్స్‌కు తెలిసి వారి ఆనందానికి అవధుల్లేవంటే నమ్మండి.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.