కొత్త వెంచర్‌లోకి సమంత.. సక్సెస్ అయ్యిందో..

సమంత ఎందుకో సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా పర్సనల్ విషయాల కారణంగా సామ్ వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. నిర్మాతగా మారి ‘శుభం’తో మంచి సక్సెస్ సాధించిన సమంత.. ఎందుకో నటనను దాదాపుగా పక్కనబెట్టేసింది. ఇప్పటికే నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా సక్సెస్ అయిన సమంత ప్రస్తుతం కొత్త వెంచర్‌లోకి అడుగు పెడుతోందని టాక్. అదేంటో కాదు.. లగ్జరీ పెర్‌ఫ్యూమ్. కొత్త పెర్‌ఫ్యూమ్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా.. దానిని ప్రీమియం లైఫ్ స్టైల్ బ్రాండ్‌గా మార్చ‌డానికి ప్రయత్నస్తోందని సమాచారం.

ప్రస్తుతం పెర్‌ఫ్యూమ్‌కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ సమంత చాలా జాగ్రత్తలు తీసుకుంటోందట. ఈ నేప‌థ్యంలోనే కాన్సెప్ట్ నుంచి బ్రాండింగ్ వ‌ర‌కూ అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అవుతోందని తెలుస్తోంది. మొత్తానికి దీనిని ఎలాగైనా సక్సెస్ చేయాలని చాలా పట్టుదలతో ఉందని సమాచారం. ఇది కానీ సక్సెస్ అయితే సమంతకు ఇక వ్యాపార రంగంలోనూ తిరుగుండదని అంతా అంటున్నారు. ఎందుకోగానీ సమంత ఇటీవలి కాలంలో ఏ సినిమాకూ సైన్ చేసిన దాఖలాలైతే లేవు. అయితే ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు మాత్రం చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. అవి రెండూ ఓకే అయితే సమంత వెండితెరపై కనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *