Sailesh Kolanu: ‘హిట్4’లో కార్తీ కేరెక్టర్ ఎలా ఉంటుందో చెప్పిన శైలేష్

నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబోలో వచ్చి ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ చిత్రం మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తాజాగా శైలేష్ కొలను మీడియాతో పంచుకున్నారు. ‘‘హిట్ సెకండ్ పార్ట్ లోనే నాని గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చివర్లో ఒక గ్లింప్స్ లాగా చూపించడంతో అర్జున్ సర్కార్ ఎలా ఉంటాడనేది ఆడియన్స్‌కి అప్పుడే ఒక అవగాహన వచ్చింది. ఈ సినిమాకి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారని ముందు అనుకున్నాం కానీ లేడీస్‌కి సినిమా బాగా నచ్చడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. కథ బాగా చెప్పగలిగితే అద్భుతంగా ల్యాండ్ అవుతుందని ముందే అనుకున్నాం. అలాగే నాకు, నాని గారికి క్యారెక్టర్ మీద చాలా నమ్మకం ఉండటంతో కరెక్ట్ ప్లేస్‌లో ల్యాండ్ అయ్యింది.

ఇండియా ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో డార్క్ వెబ్ ఒకటి. దీనిలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుండటంతో సైబర్ డిపార్ట్మెంట్ దీనిపై వర్క్ చేస్తోంది. ఇక సినిమాలో బూతుల విషయానికి వస్తే ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి కొన్ని చోట్ల తప్పలేదు. అలాగే రావు రమేష్ గారికి ముందుగానే ఆయన కేరెక్టర్ గురించి చెప్పాం. చాలా చిన్న పాత్ర అని. ఆయన ఆనందంగా ఒప్పుకున్నారు. ‘హిట్ 2’లోనూ చేసి ఉండటంతో ఆయనను తీసుకున్నాం. ఇక సముద్ర ఖని గారికి కూడా తండ్రి పాత్ర పరిధి గురించి చెప్పాం. ఆది నుంచి అంతం వరకూ తండ్రి పాత్ర కనిపించినప్పుడల్లా పంచ్‌లు పడుతూనే ఉంటాయి. సముద్రఖని గారిది చిన్న క్యారెక్టర్ అయినప్పటికీ చాలా ఇంపాక్ట్ ఫుల్‌గా చేశారు. సినిమా క్లైమాక్స్‌లో కొన్ని కేమియోస్ తీసుకొచ్చాం. కథలో ఒక క్యారెక్టర్ రావడం ఆర్గానిక్ గా ఉండాలి. హిట్ 6 లేదా 7 లో అందరి హీరోల్ని ఒక ఫ్రేమ్ లోకి తీసుకురావాలనే ఒక ఇమేజ్ నాకు ఉంది. విశ్వక్ ని ఇంకా బిగ్గర్ కాన్వాస్‌లో చూపించాలనే ఆలోచన వుంది.

‘హిట్ 4’లో కార్తీ గారి క్యారెక్టర్ ఏంటి అనేది నాకు ఐడియా ఉంది. ఆల్రెడీ సినిమాలో చూపించాం. తనకి క్రికెట్ అంటే ఇష్టం. బెట్టింగ్స్ వేస్తుంటాడు. ఆ క్యారెక్టర్ కొంచెం రూటేడ్‌గా ఉండబోతోంది. క్యారెక్టర్‌లో ఫన్ కూడా ఉంటుంది. ఇక చాగంటి గారి వాయిస్ ఓవర్ వాడడం వలన సినిమాకి ఒక ఇంట్రెస్టింగ్ టింజ్ వచ్చింది. ఈ సినిమా ఐడియా చాగంటి గారికి చెప్పడంతో నచ్చి ఆయన వాయిస్ ఇచ్చారు. వెంకటేష్ గారితో చేసిన ‘సైంధవ్’ మూవీ కొంత డిజప్పాయింట్ చేసింది. మరో సినిమా చేసి ఆయనకి ఒక పెద్ద హిట్ ఇవ్వాలనే కోరిక ఉంది. భార్య, కొడుకుతో కలిసి సిడ్నీ వెళుతున్నా. నెక్స్ట్ దాదాపు నాలుగు నెలలు అక్కడే ఉంటా. ఆ సమయంలో సిడ్నీలో కూర్చుని ఒక రొమాంటిక్ కామెడీ రాయాలని ఉంది. అదెంత వరకూ కుదురుతుందో చూడాలి’’ అని శైలేష్ కొలను చెప్పుకొచ్చారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *