దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది.
చెక్ బౌన్స్ కేసులో వర్మకు 3 నెలల సాధారణ జైలు శిక్ష పడింది.
ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్షతో పాటుగా జరిమానాను కూడా విధించింది.
వాస్తవానికి ఈ కేసు ఇప్పటిది కాదు గత ఏడేళ్లుగా కోర్టులో విచారణ జరుగుతోంది.
తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా వర్మ కోర్టుకు హాజరు అయ్యారు.
దీనిని దృష్టిలో ఉంచుకుని కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 138 ప్రకారం వర్మను దోషిగా నిర్ధారించారు.
మూడు నెలల్లోగా ఫిర్యాదుదారుడికి వర్మ రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని,
లేదంటే మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు వెల్లడించింది.
ఈ నేరం నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 131 కిందకు వస్తుందని, దీని కింద చిత్రనిర్మాతపై చట్టపరమైన చర్య తీసుకోబడిందని కోర్టు అభిప్రాయపడింది.
కాగా ఇదే కేసులో వర్మకు ఇప్పటికే ఓ సారి బెయిల్ కూడా లభించింది. ఈ చెక్ బౌన్స్ కేసును 2018లో మహేశ్‌చంద్ర మిశ్రా తరపున శ్రీ అనే సంస్థ దాఖలు చేసింది.
ఈ క్రమంలో వర్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా తాను తీస్తున్న సినిమాల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన వర్మ ఇకనుంచి తన స్థాయి తగ్గ సినిమాలు చేస్తానని ప్రకటించారు.
అందులో భాగంగానే సిండికేట్ అనే ఓ సినిమాను చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించారు.
‘ఓన్లీ మ్యాన్ కెన్ బి ద మోస్ట్ టెర్రిఫైయింగ్ యానిమల్’ అంటూ ఈ సినిమాకు ట్యాగ్ లైన్ కూడా పెట్టారు వర్మ.
పెద్ద స్టార్ లతోనే ఈ సినిమా తీయాలని వర్మ డిసైడ్ అయ్యారట. మరి ఈ సినిమా ఎలాఉండబోతుందో అన్నది చూడాలి.
సంజు పిల్లలమర్రి
Also Read This : తాగుడుకు బానిస అయిన చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్
