Revu Review : రేవులోకి కొత్త నీరు…

Revu Review :

రేవు సినిమా దర్శకుడెవరు. బాగా తీశాడు. ఫైట్స్‌కూడా చాలా స్పెషల్‌గా కంపోజ్‌ చేశాడు.

గతంలో అతను ఫైట్‌మాస్టరా? ఏంటి? అంతకుముందు ఏ పెద్ద దర్శకుని దగ్గర పనిచేశారో? హీరోలిద్దరూ ఫ్రెష్‌గా బావున్నారు..వాళ్ల పేర్లేంటి?

సెకండాఫ్‌లో వచ్చిన ఇద్దరు కుర్ర విలన్లు భలే వెరైటీగా ఉన్నారు వాళ్లు…అంతకుముందు ఏ సినిమాలో చూడలేదే…

టెక్నికల్‌గా చూస్తే కెమెరా వర్క్‌ భలేగా ఉంది..అంతకుముందు ఏ సినిమాకు పనిచేశాడు? లిరిక్స్‌ పెద్ద సినిమా రేంజ్‌లో ఉన్నాయి..పాటల్లోని పదాలు స్పష్టంగా వినిపించాయి.

మ్యూజిక్‌ వింటున్నప్పుడు మాత్రం కళ్లు స్క్రీన్‌కి చెవులు సౌండ్‌కి అతుక్కుపోయాయి…సంగీత దర్శకుడు చితక్కొట్టాడు అంతే….ఈ సినిమాకి అంత సీనుందా? అంటే ఉంది…

అంటున్నారు సినిమా చూసినవారంతా…పైన చెప్పిన అందరికి చిత్ర పరిశ్రమలో మంచి భవిష్యత్తు ఉండబోతుంది.

వర్షాకాలంలో వచ్చిన ఈ రేవు ద్వారా టాలెంట్‌ ఉన్న కొత్తనీరుకి స్వాగతం పలుకుతుంది ఫిలిమ్‌నగర్‌.

ఇందులో పులసలెన్నో , తిమింగలాలు ఎన్నో, కొరమేనులెన్నో, రవ్వలెన్నో కాలమే నిర్ణయిస్తుంది.

మీడియాలో ‘రేవు’లాంటి చిన్న సినిమా వినపడాలి ఫిలిమ్‌నగర్‌లో కనపడాలి అంటే హీరోఐనా, డైరెక్టరైనా, బ్యానరైనా ఏదో ఒకటి పెద్దదై ఉండాలి.

లేదా అంతకుమించి ఏదైనా ఉండాలి. అంతకుమించి అంటే ఫిలిమ్‌నగర్, కృష్ణానగర్, శ్రీనగర్‌ కాలని రోడ్లన్ని తెలిసిన వాళ్లై ఉండాలి.

అలా ఈ మూడు రోడ్లు తెలిస్తే సరిపోతుందా అనుకొని రోడ్లన్ని తిరిగితే వేస్ట్‌.

ఈ మూడు రోడ్లు తిరిగి నలుగురితో మంచి అనిపించుకుంటే మిమ్మల్ని నమ్మి డాలర్లు తీసుకుని ప్యాషన్‌ ఉన్న నిర్మాతలు వస్తారు.

ఈ మూడురోడ్లు ముప్పైఏళ్లుగా పట్టుకు తిరిగింది జర్నలిస్ట్‌ ప్రభు, పర్వతనేని రాంబాబు అయితే వీళ్లపై నమ్మకంతో అమెరికానుండి డాలర్లు తెచ్చింది మాత్రం మురళీ, నవీన్‌.

‘రేవు’ సినిమా స్పెషాలిటి ఏంటంటే అందరూ కొత్తవారే…అందరూ కన్న కలల్ని సాకారం చేసుకోవటానికి ఈ శుక్రవారం మీ ముందుకు వచ్చారు.

‘రేవు’ చూసినవారందరూ ముక్తకంఠంతో సినిమా చాలా బావుంది అంటున్నారు…మీరు కూడా ఓ లుక్కేయండి

              శివమల్లాల

Also Read This : అప్పుడే ఇన్నేళ్ళయిందా …చిరంజీవికే తెలియలేదు….

Revu Review
Revu Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *