గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్‌డమ్’. ఈ సినిమా విడుదల డేట్ అయితే లాక్ అయిపోయింది. తొలుత మే 30న విడుదల చేస్తామన్న మేకర్స్.. మనసు మార్చుకుని ఆ తరువాత జూలై 4కి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మొత్తానికి ఈ డేట్ అయితే ఫిక్స్. అయినా కూడా దాదాపుగా ఈ సినిమా విడుదలకు నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ‘కింగ్‌డమ్’ ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ విషయంలో దూసుకెళుతున్నాడు.
ఇలాంటి సమయంలో ఓ న్యూస్ రౌడీ హీరో అభిమానులను కలవరపెడుతోంది. సరిగ్గా సినిమా విడుదల నెల మాత్రమే ఉంది. ఈ సమయంలో సినిమాకు రిపేర్లు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అసలు ఈ తరుణంలో రిపేర్లు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అనేది అర్థం కాకుండా ఉంది. ఇటీవల ఫైనల్ కట్ చెక్ చేసుకున్న గౌతమ్ తిన్ననూరి కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని భావించడంతో రీ షూట్ చేయాలని అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే తిరిగి ఆయా సన్నివేశాలను గోవాలో చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని చాలా మేకర్స్ చాలా సీక్రెట్‌గా ఉంచుతున్నారని తెలుస్తోంది. ఈ న్యూస్ ఎంతవరకూ నిజమనేది తెలియదు కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు.