దేశమంతా అంగరంగ వైభవంగా రిపబ్లిక్‌డే వేడుకలను నిర్వహించుకున్నాం.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తమ గుండెల్లో ఉన్న దేశభక్తిని తమకు తోచిన విధంగా చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.
అందరూ ఒకలా తమ దేశాభిమానాన్ని త్రివర్ణ పతాకం ఎగురవేసి చాటుకుంటే
తమిళనాడులోని మల్టీ బిలియనీయర్, తమిళనాడు రియర్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న తెలుగువాడు
ఆదిత్యారామ్ తన దేశం మీదున్న ప్రేమను వినూత్నంగా చాటిచెప్పారు.
చెన్నైలోని ఆదిత్యారామ్ ప్యాలెస్‌పై మూడురంగుల తిరంగా జెండాలాగా లైటింగ్‌ను ఏర్పాటుచేసి అందరిని ఆశ్యర్యానికి గురిచేశారంటే అతిశయోక్తి కాదేమో.
అంతలా ఆయన నిర్మించిన రాజభవనంలాంటి ప్యాలెస్ ముందు రిపబ్లిక్‌డేని ఎంతో గొప్పగా జరిపారు ఆదిత్యారామ్.
ముఖ్యంగా ఇలాంటి ముఖ్యమైన సందర్భాలను దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫా,
అమెరికా దేశంలోని న్యూయర్క్‌లోని టైమ్ స్క్వేర్ వద్ద ప్రదర్శించటం గతంలో మనం ఎన్నోసార్లు చూశాం.
కానీ భారతదేశంలో మొట్టమొదటిసారి మన దేశ గణతంత్ర దినోత్సవాన్ని ఆదిత్యారామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మెన్
ఎంతో గొప్పగా ఆలోచించి గొప్ప వేడుకను తన ప్యాలెస్‌లో చేయటంతో ఈ రిపబ్లిక్ డే వేడుక ప్రతి ఒక్క భారతీయుడిని అలరించి ఎంతో ఆనందాన్ని అందించింది.
Also Read This : ఓరి మ్లేచ్యుడా అంటూ ఈ ఇడియట్ అందరికి మాస్ మహరాజయ్యాడు….
