హిట్, ఫట్‌లతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే ముద్దుగుమ్మలు కొందరే ఉంటారు. అలా ఒకప్పుడు రాశిఖన్నా ఉండేది. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఎందుకో గానీ టాలీవుడ్‌కు దూరంగా ఉంటోంది. అమ్మడే దూరంగా ఉంటోందా?.. లేదంటే టాలీవుడే అమ్మడిని దూరం పెట్టిందా? అనేది తెలియదు కానీ రాశిఖన్నా మాత్రం తెలుగు తెరపై కనిపించి చాలా కాలం అవుతోంది. ఇకపోతే.. అప్పట్లో ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే వచ్చి షూటింగ్ చేసేసి వెళ్లిపోయి హాయిగా రెస్ట్ తీసుకునేవారు. ఇప్పుడు అలా లేదు. రెస్ట్ తీసుకున్నారో.. ఇక వారికి ఇల్లే గతి.
ఇప్పటి ముద్దుగమ్మలు ఇంట్లో కంటే జిమ్‌లోనే ఎక్కువగా కాలం గడుపుతున్నారు. సీన్ డిమాండ్ చేసిందంటే చాలు.. యాక్షన్ సన్నివేశం అయినా వెనుకాడకుండా చేయాల్సిందే. ప్రస్తుతం హీరోయిన్ రాశిఖన్నా.. ‘ఫర్జి 2’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఒక యాక్షన్ సన్నివేశం చేస్తుండగా రాశి ఖన్నా గాయపడింది. దీంతో ఆమె చేతికి గాయమైంది. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో రాశి షేర్ చేసింది. ఆమె చేయితో పాటు మొహంపై గాయాలయ్యాయి. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోతో కావల్సినంత పబ్లిసిటీ రాబట్టేసింది. రాశి ఖన్నా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కి కాస్త దూరంగా ఉంటూ వస్తోంది.