బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించిన ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈడీ నోటీసులు జారీ చేసిన వారిలో రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి ఉన్నారు. వీరిని వరుసగా జూలై 23, 30, ఆగస్ట్ 6, 13 తేదీల్లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది. బెట్టింగ్ యాప్ కేసులో వీరు మాత్రమే కాకుండా మొత్తంగా ఇప్పటి వరకూ సుమారు 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఈ బెట్టింగ్ యాప్ కేసు నమోదైన వారిలో ‘హరి హర వీరమల్లు’ హీరోయిన్ నిధి అగర్వాల్, ప్రణీత, శ్రీముఖి, అనన్య నాగళ్ల సహా వెండితెర, బుల్లితెరకు చెందిన ఎందరో సెలబ్రీలు ఉన్నారు. పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని వీరు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్టు సమాచారం.