లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు గాని సవాల్’. ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో.. ఎల్ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బందన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ‘రాజు గాని సవాల్’ సినిమా టీజర్‌ను వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత దామోదర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు ఫ్యామిలీ ఈవెంట్ లాంటిది. బాపిరాజు గారు నాకు చాలా దగ్గరి వ్యక్తి. ఆయన ఏదైనా సినిమా తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. ‘రాజు గాని సవాల్’ సినిమాను ఆయన తీసుకున్నారంటే ఇది తప్పకుండా బాగుంటుంది’’ అన్నారు.
హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ బ్రదర్, సిస్టర్ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది, అలాగే కుటుంబంలోని బంధాలు ఎలా ఉంటాయి, స్నేహితుల మధ్య ఉన్న రిలేషన్ ఎలా ఉంటుందని చూపించాం. హైదరాబాద్ లో జరిగే కల్చరల్ ఈవెంట్స్ లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనేది సహజంగా తెరకెక్కించేందుకు లోయర్ ట్యాంక్ బండ్‌లోని కవాడిగూడలో రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. తెలంగాణ సంస్కృతి నేపథ్యంగా సాగే క్లాసిక్ మూవీ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి ఎమోషనల్ డ్రామా ఉంటుంది’’ అన్నారు. హీరోయిన్ రితికా చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. “రాజు గాని సవాల్” సినిమా నేటివ్ ఎలిమెంట్స్ తో పక్కా లోకల్‌గా ఉండి ఆకట్టుకుంటుంది’’ అన్నారు. ప్రొడ్యూసర్ తరుణిక మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా మాస్ ఎలిమెంట్స్ తో పాటు మనసుకు హత్తుకునే సెంటిమెంట్‌తో ఉంటుంది. “రాజు గాని సవాల్” సినిమా సక్సెస్ పై నమ్మకం ఉంది’’ అన్నారు. అతిథిగా వచ్చిన నిర్మాత సాంబశివరావు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది పెద్ద విజయాన్ని సాధించాలి’’ అన్నారు.
ప్రజావాణి చీదిరాల