Rajendra Prasad :
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ‘హరికథ’ అనే ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ : ‘‘ నేను చేసిన ‘అప్పుల అప్పారావు’ ‘లేడిస్ టైలర్’ ‘ఏప్రిల్ 1 విడుదల’లలోని పాత్రలన్నీ హీరోల పాత్రలా?
వాడు హీరోనా? అంటూ తన 48 ఏళ్ల సినిమా కెరీర్‌లోని అనేక పాత్రల గురించి మాట్లాడారు.
అదే సందర్భంలో ఈరోజు సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న పుష్ప సినిమాలోని అల్లుఅర్జున్ పాత్ర కూడా ఎర్రచంధనం స్మగ్లర్ పాత్రే అంటూ మాట్లాడారు.
ఇంకా ఆయన ‘హరికథ’ వెబ్‌సిరీస్‌లోని తన పాత్ర గురించి
దర్శకుడు మ్యాగీ గురించి ప్రముఖ నటుడు యం.యస్ నారాయణ కూతురు శశికిరణ్ నారాయణ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఎంత గొప్పగా పనిచేశారు అని
‘హరికథ’ వెబ్‌సిరీస్ నిర్మాత టి.జి విశ్వప్రసాద్ గురించి అనేక విషయాలు మాట్లాడారు.
ఆయన మాట్లాడిన విషయాలు కాకుండా అల్లు అర్జున్‌ను , ఆయన చేసిన ‘పుష్ప–2’ సినిమాను దుర్భాషలాడినట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుగా ప్రచారం చేయటంతో
ఆయన వారందరికి తనదైన రీతిలో ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా ఆర్‌పి బన్నీగురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ నువ్వు నా బిడ్డలాంటివాడివి.
నిన్ను నేను తప్పుగా మాట్లాడతానా? ఐ లవ్ యూ అంటూ బన్నీకి, బన్నీ ఫ్యాన్స్‌కి సమాధానం చెప్పారు నటుడు రాజేంద్ర ప్రసాద్. ఈ వీడియో నెట్టింట్లో ఇప్పుడు హల్‌చల్ చేస్తుంది.
శివమల్లాల
Also Read This : రెండు ఆస్కార్ అవార్డులు మణికొండలో ఉన్నాయి..