Rajamouli :
దర్శకధీరుడు రాజమౌళి ఏమంటా తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ గురించి చెప్పారో కానీ నాటి నుంచి ఆయన తీస్తున్న సినిమాను వదిలి దీని చుట్టే మీడియా, సోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. తాజాగా ‘హిట్ 3’ ప్రి రిలీజ్ ఈవెంట్‌లోనూ దీనిపై జక్కన్న క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టులో నేచురల్ స్టార్ నాని సైతం భాగం కానున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. ఇక అప్పటి నుంచి ఈ సినిమా విషయమై చాలా ఊహాగానాలు వినవస్తున్నాయి. రాజమౌళి ఈ సినిమా కోసం తనని తాను ఎనిమిదేళ్ల పాటు లాక్ చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ‘మహాభారతం’ను మూడు పార్టులుగా తెరకెక్కించడమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘బాహుబలి’ రెండు పార్టుల కోసం ఐదేళ్లు తీసుకున్న జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్టును మూడు పార్టులుగా రూపొందించేందుకు కనీసం ఎనిమిదేళ్లయినా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మహాభారతంను సాదాసీదాగా తెరకెక్కించితే పెద్దగా ఎవరూ చూడదు. మార్వల్ సినిమాటిక్స్ తరహాలో భారీ విజువల్స్ ఉంటేనే ఆసక్తి పెరుగుతుంది. దీనికోసం రాజమౌళి తన ఫోకస్ గట్టిగానే పెడతారనడంలో సందేహం లేదు. సూపర్ స్టార్ మహేశ్‌తో సినిమా పూర్తవగానే జక్కన్న ‘మహాభారతం’ను లైన్‌లో పెట్టే పనిలో పడతారని తెలుస్తోంది. ఈ సినిమాలో దేశంలోని అన్ని సినీ పరిశ్రమల నుంచి స్టార్ తారాగాణం నటిస్తుందని ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.
Also Read This : ఆ స్టార్ హీరో ‘యమలీల’తో ఎంట్రీ ఇస్తే ఎలా ఉండేదో ?