‘విక్రమార్కుడు’ సినిమాలో బాలనటుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించిన రవి రాథోడ్ గురించి తెలిసిందే. ప్రస్తుతం రవి రాథోడ్.. సెట్ వర్క్స్ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో రవి రాథోడ్ రాఘవ లారెన్స్ గురించి మాట్లాడాడు. అవకాశాల కోసం ఎంతగానో వెదికి వెదికి అలసిపోయానని.. అందుకే సెట్ వర్క్స్ చేస్తున్నట్టు తెలిపాడు. తన తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం మరణించారని.. తాను స్నేహితులతో కలిసి ఉంటున్నట్టు తెలిపాడు. అయితే గతంలో లారెన్స్ తనను దత్తత తీసుకుని.. ఓ స్కూల్‌లో జాయిన్ చేయించాడన్నాడు. అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదని.. స్కూలు నుంచి సెలవుల సమయంలో హాస్టల్ నుంచి పారిపోయానని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత అక్కడికి తాను వెళ్లలేదని తెలిపాడు. అయితే ఈ విషయం లారెన్స్‌కు తెలిస్తే ఆయన కోప్పడతారని చెప్పలేదన్నాడు. దీనిని చూసిన లారెన్స్ ఈ వీడియోపై స్పందించాడు.
రవి రాథోడ్.. వీడియో చూసి తన హృదయం తరుక్కుపోయిందని.. తనను ‘మాస్’ సినిమా షూటింగ్‌లో కలిశాడని వెల్లడించారు. అప్పట్లో ఓ స్కూల్‌లో చేర్పించాని.. కానీ దాని నుంచి వెళ్లిపోయాడని తనకు తెలిసిందన్నారు. అతడిని కలిసేందుకు చాలా ప్రయత్నించానని.. ఇన్నేళ్ల తర్వాత అతడిని చూడటం తననెంతో భావోద్వేగానికి గురి చేసిందన్నారు. కాకపోతే ఏడాది తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. అతడిని కలిసేందుకు ఎంతో ప్రయత్నించానని.. ఇన్నేళ్ల తర్వాత అతడిని చూస్తుంటే భావోద్వేగంగా ఉందన్నాడు. తానేమీ రవి రాథోడ్‌పై కోప్పడబోనని.. వాస్తవానికి తనను కొట్టను.. తిట్టనని.. తనను ఒక్కసారి చూడాలని ఉందని తెలిపారు. రవి కోసం తాను వేచి చూస్తుంటానని.. ఒక్కసారి వచ్చి కలవాలని కోరాడు.