SIIMA Awards 2025: 11 నామినేషన్స్‌తో టాప్ 1లో ‘పుష్ప2’..

దక్షిణాది సినిమాల పరంగా ప్రతి ఏటా ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’ (SIIMA) వేడుకకు రంగం సిద్ధమైంది. సైమా అవార్డ్స్‌లో భాగంగా గత ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాలు వివిధ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే పలు దక్షిణాది భాషల్లో నామినేట్ అయిన సినిమాల జాబితాను నేడు (బుధవారం) సైమా ప్రకటించింది. టాలీవుడ్ విషయానికి వస్తే టాప్‌లో ‘పుష్ప2’ నిలిచింది. ఏకంగా 11 నామినేషన్స్‌తో ఈ చిత్రం టాప్‌లో నిలిచింది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీని తర్వాతి స్థానంలో ‘కల్కి’ చిత్రం నిలిచింది.

ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కాంబోలో వచ్చిన ‘కల్కి2898 ఏడీ’ మంచి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం 10 నామినేషన్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఇక దీనికి సమానంగానే తేజ సజ్జా-ప్రశాంత్‌ వర్మల బ్లాక్‌బస్టర్‌ ‘హను-మాన్‌’ కూడా 10 నామినేషన్స్‌ దక్కించుకుంది. తమిళం విషయానికి వస్తే శివకార్తికేయన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘అమరన్’ ఏకంగా 13 నామినేషన్స్‌తో టాప్‌లో నిలిచింది. దీని తర్వాత ‘లబ్బర్ పందు’ 8 నామినేషన్స్.. ‘వాళ్లై’ 7 నామినేషన్స్ దక్కించుకుంది. కన్నడలో ‘భీమా’ 9.. కృష్ణ ప్రణయ సఖి 9.. ఇబ్బని తబ్బిడ ఇలియాలి 7 కేటగిరీల్లో పోటీ పడుతున్నాయి. మలయాళం విషయానికి వస్తే పృథ్వీరాజ్‌ సుకుమారన్‘ఆడుజీవితం’ 10..‘ఏఆర్‌ఎం’ 9, ‘ఆవేశం’ 8 నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *