మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న చిత్రం #SSMB29. ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంకా చోప్రా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘సర్జమీన్’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తానెప్పుడూ సినిమా కథల ఎంపిక విషయంలో ముక్కుసూటిగా ఉంటానని. స్క్రిప్ట్ తనకు సరిపోతుందనిపిస్తేనే ఓకే చెబుతానని అన్నారు. అలా తనకు నచ్చని కథలను చేయనని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు.
ఇప్పటివరకూ ఎవరూ ఊహించని రీతిలో #SSMB29 కథను రాజమౌళి తీర్చిదిద్దుతున్నారని పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు. అదొక అద్భుత దృశ్య కావ్యమని.. రాజమౌళి ఎంచుకునే కథలన్నీ భారీగా ఉంటాయని తెలిపారు. ఈ సినిమా కూడా అలాంటిదేనని అన్నారు. ప్రతిఒక్కరినీ అలరించేలా కథను చెప్పడంలో రాజమౌళి సిద్ధహస్తుడని.. ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం అయితే ఈ సినిమా షూటింగ్‌కి కాస్త విరామం ఇచ్చి మహేశ్ తన కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం శ్రీలంక వెళ్లాడు. తిరిగి సినిమా షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ నెలలో కెన్యాలో ఈ సినిమా షూటింగ్ జరగాల్సి ఉంది కానీ అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో షెడ్యూల్‌ను వాయిదా వేసినట్టు తెలుస్తోంది.