స్వధర్మ్‌ అంటేనే సొంతధర్మం…నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా

హ్యాట్రిక్‌ హిట్‌ నిర్మాత..

నిర్మాతంటే క్యాషియర్‌ కాదు ఇండస్ట్రీలో చాలామంది కెరీర్‌లు సెట్‌చేసే వ్యవస్థ అని నిరూపించే ఎంతోమంది నిర్మాతల్లో ఇతను చేరారు.

పెద్ద పెద్ద బిజినెస్‌లు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడలా నిర్మాతగా మారి నిర్మాత సత్తా ఏంటో చిత్ర పరిశ్రమకు తెలియచేశారీయన.

తను ధర్మంగా ఉండాలి, ఉంటాను అనే నమ్మకం ఉంది కాబట్టి తన బ్యానర్‌ పేరు కూడా స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనే నిర్మాణ సంస్థను నెలకొల్పి

సుమంత్‌ హీరోగా ‘మళ్లీరావా’ అనే బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీని తెరెకెక్కించి చక్కని విజయాన్ని అందుకున్నారు నిర్మాత రాహుల్‌ యాదవ్‌ నక్కా.

నానితో ‘జెర్సీ’, విజయ్‌దేవరకొండతో ‘కింగ్‌డమ్‌’ సినిమాల దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరిని ‘మళ్లీరావా’తో దర్శకునిగా పరిచయం చేసింది రాహులే.

మొదటి సినిమా ఇచ్చిన కిక్‌తో రెండో సినిమాకూడా నవీన్‌ పొలిశెట్టి హీరోగా నటించిన ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’తో

స్వరూప్‌ ఆర్‌.ఎస్‌.జెని దర్శకునిగా పరిచయం చేసి నిర్మాతగా పెద్ద విజయాన్ని అందుకున్నారు రాహుల్‌.

నటుడు తిరువీర్, సంగీత, కావ్య కల్యాణ్‌రామ్‌లు కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘మసూధ’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు.

ఆ సినిమాతో సాయికిరణ్‌ని దర్శకునిగా పరిచయం చేసింది స్వధర్మ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.

ఇలా ముగ్గురు కొత్త దర్శకులను పరిచయం చేసి హ్యాట్రిక్‌ విజయాలను అందుకోవటంతో తక్కువకాలంతోనే సంచలన నిర్మాతగా మారారు రాహుల్‌ యాదవ్‌ నక్కా.

ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక పాడ్‌కాస్ట్‌ ఇంటర్వూలో చాలా ఓపెన్‌గా తన అభిప్రాయాలను వెల్లడించారు రాహుల్‌.

పార్ట్‌1లో తన సక్సెస్‌ స్టోరీ మాత్రమే ఉంది ..

కొత్త దర్శకులతో అంత సక్సెస్‌ఫుల్‌ సినిమాల తీసిన రాహుల్‌ మరో కొత్త దర్శకుడు ఆర్‌విఎస్‌ నిఖిల్‌ని పరిచయం చేసి ‘బ్రహ్మానందం’ సినిమాని రూపొందించారు.

‘బ్రహ్మానందం’ సినిమాతో అంత పెద్ద ఫ్లాప్‌ను చూడటానికి కారణాలేంటి? ఇలాంటి అనేక విషయాలను పార్ట్‌2 ఇంటర్వూలో చూద్దాం…ఇంటర్వూ బై శివమల్లాల

Also Read This : ఈ పండిత పుత్రుడికి ఏ పురుగు కుట్టిందో…సినిమాల్లోకి వచ్చాడు…

Producer Rahul Yadav Nakka
Producer Rahul Yadav Nakka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *