ఆడలేక మద్దెల ఓడు అన్నాడట వెనుకటికి ఒకడు.. సింగర్ ప్రవస్తి ఆరాధ్య పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఏ ఆటలో గెలవాలన్నా చివరి దాకా ఆడాలి. అది ఆటైనా.. జీవితమైనా.. గ్రౌండ్‌లో ఉంటేనే ఆటగాడిగా గెలుస్తాం. అందరితో పోరాడితేనే ఈ కాంపిటీషన్ ప్రపంచంలో నెగ్గుకురాగలం. అలా కాకుండా ఏదైనా మధ్యలో వదిలేస్తే ప్రవస్తి ఆరాధ్యలాగే మిగిలిపోతాం. ఆడినంత సేపు ఆట ఆడింది. అవుట్ అయిన తర్వాత పక్కవాళ్లపై నిందలు వేస్తోంది. ఇది ఈనాటి షో కాదు. ఇది స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం మనసులో నుంచి పుట్టిన ఆలోచన. 30 ఏళ్లుగా ఒక షో ఒక ఛానల్‌లో రావడమనేది చిన్న విషయమేమీ కాదు. ఆ ప్రోగ్రాం నుంచి ఎందరో గాయకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రవస్తి కూడా పోటీలో చాలా కాలం నిలిచింది. పొరపాటో.. గ్రహపాటో షో నుంచి బయటకు వచ్చేసింది.
బయటకు వచ్చాక ఆరోపణలు స్టార్ట్ చేసింది. 30 ఏళ్ల చరిత్రపై మరకలు వేయడం ప్రారంభించింది. ఒకవేళ సింగర్ సునీత కానీ, రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి వీరిలో ఎవరైనా ఎప్పుడైనా పక్షపాత వైఖరి అవలంబించి ఉంటే కనీసం ఒక్కరైనా ఆరోపణలు చేసి ఉండేవారు కాదా? తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకురావడంతో కీరవాణి, చంద్రబోస్ కృషి చాలా ఉంది. అలాంటి వారిపైనా అభాండాలు? ఒకవేళ కీరవాణి తాను మెలోడీకే సపోర్ట్ చేస్తానని ప్రవస్తి చెప్పినట్టుగా చెప్పి ఉంటే.. ఆమె మెలోడీతోనే ఆయన్ను మెప్పించి ఉండవచ్చు కదా? ఎందుకు మెప్పించలేదు? సునీత, చంద్రబోస్ పక్షపాత వైఖరిని ప్రోగ్రాంలో ఉండగా ఎందుకు చెప్పలేదు? బయటకు వచ్చాక చెప్పడం ఎంతవరకూ కరెక్ట్? ఇది చదువుతున్న వారెవరికైనా ఒక అమ్మాయికి కాకుండా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకు సపోర్ట్ నిలిచామని అనిపించవచ్చేమో.. ఎవరికీ సపోర్ట్ కాదిది.. నిజానికి మేమిస్తున్న మద్దతు మాత్రమే.
ప్రజావాణి చీదిరాల