పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శరవేగంగా సినిమాల షూటింగ్ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే ‘ది రాజాసాబ్’ను ముగించే పనిలో ఉన్నారు. అలాగే హను రాఘవపూడితో చేస్తున్న ‘ఫౌజి’ చిత్రాన్ని సైతం పరుగులు పెట్టిస్తున్నాడు. ఇవి రెండూ పూర్తికాక మునుపే సందీప్‌రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దీనిని సందీప్‌రెడ్డి వంగా చేస్తోన్న చిత్రాన్ని చకచకా పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఇప్పుడు మరోవైపు ‘స్పిరిట్’ను పట్టాలెక్కించేందుకు జోరుగా సన్నాహాలు చేసుకుంటున్నారు. ‘యానిమల్’ విజయం తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రమిది.
భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్‌లో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే దీని కోసం ప్రభాస్ బల్క్‌గా డేట్స్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. హైఓల్టేజ్ కాప్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఏక కాలంలో తొమ్మిది భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది.