ఏదైన ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాలే..

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ఫస్ట్ షాట్ పీకాడు. బర్త్‌డే.. ఉగాది.. ఇలా ఒక్కో అకేషన్‌కి ఒక్కో అప్‌డేట్ ఇస్తున్న దర్శకుడు బుచ్చిబాబు సాన.. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా గ్లింప్స్ విడువల చేశారు. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇది. ఊరమాస్ గెటప్‌లో చెర్రీ చాలా స్టైలిష్‌గా వచ్చి ఫస్ట్ షాట్ కొట్టాడు. అది చూసిన ఫ్యాన్స్ అంపైర్లుగా మారిపోయి అది పక్కా సిక్సర్ అని తేల్చేస్తున్నారు. 54 సెకన్స్ బ్లాస్టింగ్ పెద్ది గ్లింప్స్ అంటూ రెహమాన్ మ్యూజిక్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసేందుకు చెర్రీ వచ్చాడు. ముందుగానే దీనికి సంబంధించిన క్లూస్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా గ్లింప్స్ కోసం ఎదురు చూశారు.

‘‘ఒకటే పని చేసేనాకి ఒకే నాగ బతికెయ్యనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు.. ఏదైన ఈ నేల మీద ఉన్నప్పుడే సేసేయాల.. పుడతామా ఏటి… మల్లీ సెప్మీ’’ అంటూ ఊరమాస్ డైలాగ్‌తో.. ఊరమాస్ లుక్‌లో స్మోక్ రామ్ చరణ్ కనిపించాడు. రెహ్మాన్ మ్యూజిక్ ఈ గ్లింప్స్‌కి ప్రధాన హైలైట్. పెద్ది ఫస్ట్ షాట్ అయితే టోటల్ గ్లింప్స్‌కే హైలైట్. ఈ గ్లింప్స్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్‌ని అయితే చూపించలేదు. అయితే అమ్మడి రోల్ మాత్రం అదిరిపోతుందని టాక్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *