ప్రముఖ కథానాయకులు బాలకృష్ణ (Balakrishna), అజిత్‌కుమార్ (Ajith Kumar)లు పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) వీరికి పద్మభూషణ్ అందించారు. ఈ క్రమంలోనే బాలయ్య, అజిత్‌లకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan( సైతం వీరికి ఓ ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హిందూపురం శాసనసభ్యులు, ప్రముఖ కథానాయకులు బాలకృష్ణ (Balakrishna) పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉండటమే కాకుండా చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన శైలి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. కళాసేవతో పాటు ప్రజా సేవలోనూ ఆయన మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని తెలిపారు.
ఇక అజిత్‌ను (Ajith Kumar) ఉద్దేశిస్తూ.. ‘‘కుటుంబ, ప్రేమకథా సినిమాలతో మెప్పిస్తూనే వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. స్టైల్ పరంగాను తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. రేసర్‌గానూ రాణిస్తున్నారు. మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలి’’ అని పవన్ ఆకాంక్షించారు.
ప్రజావాణి చీదిరాల