ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. ఆలియాభట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.తాజాగా లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈ సినిమా స్క్రీనింగ్ జరిగింది. ఇక దీంతో పాటు కీరవాణి లైవ్ కాన్సెర్ట్ కూడా జరిగింది. ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘నాటు నాటు’ పాటలో తన స్నేహితుడు రామ్‌చరణ్‌తో కలిసి స్టెప్పులు వేయడాన్ని ఎప్పటికీ మరచిపోలేనని తెలిపాడు.
మెగాస్టార్ చిరంజీవి, తన బాబాయి బాలకృష్ణ కూడా అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని.. వారిద్దరూ కలిసి ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేస్తే అదొక మంచి జ్ఞాపకంగా నిలిచిపోతుందని పేర్కొన్నాడు. మొత్తానికి ఎన్టీఆర్ నోటి వెంట బాలయ్య పేరు రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. మరి బాలయ్య దీనిని ఎలా తీసుకుంటారో.. అసలు పట్టించుకుంటారో లేదో చూడాలి. ఒకవేళ ఏదైనా సందర్భం వచ్చి ఎన్టీఆర్ మాట నిజమై చిరు, బాలయ్య కలిసి ‘నాటు నాటు’కు స్టెప్పులేశారో అది నెట్టింట దుమ్ములేపుతుందనడంలో సందేహమే లేదు. ఇక ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, రాజమౌళి కూడా పాల్గొన్నారు.
ప్రజావాణి చీదిరాల