మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.
కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది.
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ సీక్వెల్‌తో తిరిగి మంచి హిట్ కొట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తన బావమరిది నార్నె నితిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నార్నె నితిన్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ : ‘‘నాకు 2011లో పెళ్లైంది. అప్పుడు నితిన్ చిన్న పిల్లోడు. నాతో మాట్లాడటానికి కూడా భయపడేవాడు.
నేనింట్లోకి వస్తుంటే లోపలికి వెళ్లిపోయేవాడు. వీడు కదా నాతో మాట్లాడాలి.. మాట్లాడటేంటని రోజూ అనుకుంటూ ఉండేవాడిని.
వీడు ధైర్యం చేసుకుని నాతో చెప్పిన మొట్టమొదటి మాట ‘బావ నేను యాక్టర్ అవుతా’ అని.
అంతే ధైర్యంగా నేను కూడా నా సపోర్ట్ నీకుండదు పోయి చావు అని చెప్పా. చెప్పడం చెప్పాను కానీ నాకొక భయం ఉండేది.
యాక్టింగ్ అంటున్నాడు.. నలుగురైదుగురు మధ్య ఉండే వ్యక్తి ఈరోజు అందరి ముందు ఎక్స్‌పోజ్ అవబోతున్నాడు.
ఎలా ఉండబోతుంది తన కెరీర్ అని భయం ఉండేది. కానీ ఏ రోజు కూడా ఒక్క సీన్ కూడా నాకు వివరించలేదు.
ఎందుకంటే.. నేనన్నాను.. నాకేమీ చెప్పొద్దు నితిన్. నీకావల్సింది నువ్వు చేసుకో. లైఫ్‌లో ఆ ఫ్రీడం ఉండాలి.
ఒకరి షాడో మరొకరి మీద పడకూడదు అని చెప్పాను. ఈరోజు తనని చూసి చాలా గర్వంగా ఉంది’’ అని ఎన్టీఆర్ అన్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ‘మ్యాడ్ స్క్వేర్’ దర్శకుడు ఎన్టీఆర్ కాళ్లకు దణ్ణం పెట్టబోగా ఆయన ఏం చేశారంటే..