మ్యాడ్ స్క్వేర్ మూవీ సక్సెస్ మీట్ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ‘మ్యాడ్’తో నవ్వులు పూయించిన నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ సీక్వెల్‌తో తిరిగి మంచి హిట్ కొట్టారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘నవ్వించడం అనేది గొప్ప వరం. ఎన్ని కష్టాల్లో ఉన్నా ఒక మనిషి నవ్వించగలిగితే బయట పడొచ్చు కదా అనిపిస్తుంది. అలాంటి మనిషి కల్యాణ్ శంకర్. ఒక చిత్రాన్ని హిట్ చేశాక సీక్వెల్‌ను అంతకంటే గొప్పగా ప్రజల్ని రంజింపజేయడం కష్టం. అది నువ్వు సాధించావు. ఒక ప్యూర్ హార్ట్ నీకుంది. దాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. దర్శకుడికి ఉండాల్సిన గొప్ప గుణమది’’ అన్నాడు. దీంతో కల్యాణ్ శంకర్ ఎన్టీఆర్ కాళ్లకు దణ్ణం పెట్టబోగా.. దీనికి ఎన్టీఆర్ దయచేసి ఇలాంటివి చేయొద్దని వారించారు. ‘మీ అమ్మానాన్నల కాళ్లకు దణ్ణం పెట్టండి చాలు’ అంటూ ఎన్టీఆర్ మాట్లాడిన తీరు ఆకట్టుకుంది.
ప్రజావాణి చీదిరాల