నిత్యామేనన్ ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అవుతున్నా స్టార్ హీరోయిన్‌గా మాత్రం మారలేకపోయింది. కానీ నటిగా ఎన్నో అవార్డులు, రివార్డులను మాత్రం సొంతం చేసుకుంది. సెలక్టివ్‌గా సినిమాలను చేస్తూ మెప్పిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ‘సార్ మేడమ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోల్‌మేట్ కోసం వెదకడం.. వివాహం వంటి విషయాలపై స్పందించింది. ప్రేమ గురించి కొన్నాళ్ల క్రితం ఆలోచించాను కానీ ప్రస్తుతం నా జీవితంలో దానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. గతంలో కుటుంబం, సమాజం కోసం సోల్‌మేట్ ఉండటం అనివార్యమనిపించి అతడి కోసం వెదికిన సందర్భాలున్నాయి.
ఇప్పుడు మాత్రం వేరే రకంగా జీవితాన్ని ఆనందించవచ్చని అర్థమైంది. ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. రతన్ టాటా సైతం పెళ్లి చేసుకోలేదు. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే.. అది జరిగినా.. జరుగకున్నా మార్పుండదు. తోడు లేనందుకు ఒక్కోసారి బాధనిపిస్తుంది. అయినా కూడా స్వేచ్ఛగా జీవించడం ఆనందాన్నిస్తోంది. ప్రస్తుతం నేనిలా ఉండటానికి కారణం జీవితంలో నేర్చుకున్న కొన్ని పాఠాలేనని నిత్యా మీనన్ చెప్పుకొచ్చింది. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘సార్ మేడమ్’ జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.