Court :
కోర్టుకోసం నాని ఎందుకు ఇంత తపన పడుతున్నారు?
నాని ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు అంతే..మిగతా అంతా చేసేశాడు.
అక్కకోసం తన బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమాని ఇవ్వటమే కాకుండా ప్రమోషన్స్‌లో పాల్గొని చాలా గట్టిగా మాట్లాడారు, మాట్లాడుతున్నారు.
ఇదంతా దేనికోసం? ఒక సినిమాను బతికించటం కోసం..నిజంగా నాని హీరోనే.
ఎందుకంటే c : ‘‘ మీరంతా ‘కోర్టు’ అనే ఈ సినిమాను థియేటర్‌లో చూడండి.
తప్పకుండా మంచి సినిమా చూసిన ఫీలింగ్ మీకు కలుగుతుంది.
ఒకవేళ నేను చెప్పినట్లు ఈ సినిమా లేకపోతే, మీకు నచ్చకపోతే నేను హీరోగా చేస్తున్న ‘హిట్–3’ సినిమాను చూడమని నేను చెప్పను’ అన్నారు.
ఇది చాలా పెద్ద స్టేట్‌మెంట్.
ఈ స్టేట్‌మెంట్ తర్వాత ‘కోర్టు’ సినిమాని ప్రేక్షకులందరూ చూసే చూపే మారిపోయింది.
నాని పిచ్చోడేం కాదు, పుసుక్కున అంత పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చేయటానికి. నానికి ప్రేక్షకుల నాడి ఖచ్చితంగా తెలుసు.
వాళ్లు ఏ సినిమాను నెత్తిన పెట్టుకుంటారో, ఏ సినిమాను లైట్ తీసుకుంటారో నానికి తెలిసినంతగా ఈ జనరేషన్ హీరోల్లో మరో ఏ హీరోకి తెలియదు.
‘కోర్టు’ సినిమాను నాని చూసిన తర్వాతే ఈ స్టేట్‌మెంట్స్ అన్నీ మీడియా ముందుకు వచ్చి ఇస్తున్నారు.
నిర్మాత అంటే క్యాషియర్ కాదు.
క్యాష్‌తోపాటు కంటెంట్ ఉన్నోడే నిర్మాతగా ఉండాలి,
ఒక క్రియేటర్‌గా స్క్రిప్ట్ మీద ఉన్న కథను ప్రేక్షకులకు ఎలా చెప్పాలో,
ఎక్కడ ఎంత ఖర్చుపెడితే బొమ్మ బాగా కనిపిస్తుందో తెలిసినవాడే సినిమాను తీయాలని ‘కోర్టు’ సినిమాద్వారా చెప్పాలని
నిర్మాత ప్రశాంతి తిపిర్నేని, సహ నిర్మాత దీప్తి గంటా గట్టిగానే నిర్ణయించుకున్నారు.
కథను చెప్పి దర్శకత్వం వహించిన రామ్ జగధీష్ కూడా ‘కోర్టు’ సినిమాద్వారా కొత్తతరం కథను ప్రేక్షకులకు అందిస్తాడని నాని చెప్తున్నారు.
అంత పాపులర్ హీరో నాని ఒక కంటెంట్ ఓరియంటడ్ సినిమా కోసం ఇంత పెద్ద బెట్ ఎందుకు పెట్టారో సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.
సినిమా ట్రైలర్ చూస్తే అనేక సెక్షన్ల గురించి మాట్లాడారు.
ఆ సెక్షన్లన్నీ మనం గత సినిమాల్లో అనేకసార్లు చూసినవే. కానీ, వాటిలో పోక్సో చట్టం అని రాగానే ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడ్తారు.
‘కోర్టు’ సినిమాతో పోక్సో చట్టం గురించి ప్రేక్షకులకు గట్టిగానే చెప్పటానికి నాని అండ్ టీమ్ సిద్ధమయ్యారు. నాని బెట్ గెలుస్తాడో లేదో చూడాలి మరి….
శివమల్లాల
Also Read This : 29 ఏళ్ల తర్వాత ఆయన్ను కలిశాను…
