Nani: గత ఫీలింగ్‌ను తిరిగి ఇవ్వాలనే ట్రైలర్‌ను ముందుగా విడుదల చేశాం

నేచురల్ స్టార్ నాని అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన చిత్రం ‘హిట్ ది థర్డ్ కేస్‌’. డాక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని, నాని యూనానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వైజాగ్‌లో.. ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా మా టీమ్ అంతా చాలా కష్టపడ్డారని తెలిపారు. సాధారణంగా ఈ మధ్యకాలంలో లాస్ట్ మినిట్‌లో ట్రైలర్స్ ఇస్తున్నారని.. గతంలో అయితే సినిమా విడుదలకు 20 రోజులు ముందు ట్రైలర్ వచ్చేదన్నారు. గత ఫీలింగ్‌ను మళ్లీ ఇద్దామని ట్రైలర్‌ని ముందుగానే విడుదల చేసినట్టు నాని తెలిపారు.

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. ట్రైలర్‌ను యూనిక్‌గా క్రియేట్ చేశామన్నారు. డీఓపీ సాను జాన్ వర్గీస్ మాట్లాడుతూ.. తెలుగులో నాలుగు సినిమాలు చేశానని.. ఆ నాలుగూ నానితోనే పని చేశానని తెలిపారు. ఈ సినిమాలో ఇందులో నాని చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని తెలిపారు. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర మాట్లాడుతూ.. నానితో ఇదే తన తొలి సినిమా అని తెలిపారు. తన కెరీర్‌కి బెస్ట్ మూవీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్నికల్ గా చాలా డీటెయిల్‌తో డే అండ్ నైట్ వర్క్ చేశామన్నారు. బిగ్ స్క్రీన్ మీద మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఫ్యాషన్‌తో పని చేశామని నాగేంద్ర తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *