Gowra Hari : అందుకే హిమాలయాలకు పారిపోయేవాడిని

ఒక సామాన్యుడు సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎలా మారాడు?

ఒక మీడియా సంస్థకోసం కొన్ని లక్షల రూపాయల పని చేస్తే పక్కకు పిలిచి కొన్నివేల రూపాయలు చేతిలో పెడితే ఆ డబ్బులు వద్దని వాళ్లకే ఇచ్చేశాడతను.

కట్‌చేస్తే ఆటోకి కూడా డబ్బులు లేవు…నడుచుకుంటూ తన అన్నిరోజుల కష్టాన్ని తలచుకుంటూ వళ్లంతా చెమటతో కళ్లవెంట కారుతున్న నీళ్లతో 7 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లాడు.

మరోసారి తను ఉంటున్న ఇల్లుని ఖాళీచేయిస్తే లారీలో సామాను పెట్టుకుని అద్దెంటికోసం రోజంతా రోడ్లమీద తిరిగాడు.

ఆ రోజున తను డిసైడ్‌ చేసుకున్నాడు.

ఏ హైదరాబాద్‌లో అయితే డబ్బుల్లేక రోడ్లపై నిలబడ్డానో అదే హైదరాబాద్‌లో నాకు సొంత ప్లేసుండాలని నిర్ణయించుకున్నాడు. కట్‌చేస్తే మూడుచోట్ల స్థలాలు కొన్నాడు.

అతనిలోని సంగీత దర్శకుడు ఎంతో కసి పెంచుకున్నాడు.

నా పాటలు ఈ మీడియా హౌస్‌లో కాదు..ప్రపంచంలోని తెలుగు వారందరూ వినాలి అనుకుని దిక్కులు పెక్కటిల్లేలా అరిచేస్తూ గిటార్‌ తీశాడు.

ఆ అరుపులు ఏ దేవుడు విన్నాడో…..‘రఘునందన, రఘు రఘు నందన …’ అంటూ ‘హనుమాన్‌’ చిత్రానికి సంగీతాన్ని అందించి

తన పాటలు విశ్వమంతా లె లిసేలా చేసుకున్న ఆ సంగీత దర్శకుడే గౌర హరి.

చిన్నప్పటినుంచే సంగీతం అనే మత్తులో తేలేవాడు.

తేజా సజ్జా, ప్రశాంత్‌ వర్మలతో పాటు సంగీత దర్శకునిగా నాకు హనుమాన్‌ సినిమాకి నేషనల్‌ అవార్డు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు అంటున్నాడు.

ప్రస్తుతం ‘మిరాయి’ చిత్రంతో మరోసారి తన సంగీతంతో మెరుస్తున్నాడు.

దర్శకుడు సాయిరాజేశ్‌ ఒన్‌ ఆఫ్‌ ది ఫైనెస్ట్‌ పర్సన్‌ అన్నారు.

ఇప్పటికింతే అంటూ ట్యాగ్‌తెలుగుకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో బోలెడు టాపిక్స్‌ మాట్లాడారు.

తన సక్సెస్‌స్టోరీని మీరు ఓసారి చూసేయండి….ఇంటర్వూ బై శివమల్లాల

Also Read This : ఈ పండిత పుత్రుడికి ఏ పురుగు కుట్టిందో…సినిమాల్లోకి వచ్చాడు…

Music Director Gowra Hari Exclusive Interview
Music Director Gowra Hari Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *