...

Mangalavaram Review “మంగళవారం” చెప్పుకోదగ్గ ఎమ్ లేదంట.!

Mangalavaram Review

పాయల్ “మంగళవారం” చెప్పుకోదగ్గ ఎమ్ లేదంట.!

ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన భామ పాయల్ రాజపుత్.

ఆ సినిమాలో పాయల్ నటనతో పాటు – పాయల్ అందచందాలకు – అడ్డు చెప్పని ఎక్సపోజింగ్ కి కుర్రకారు పిచ్చపిచ్చగా ఫ్యాన్స్ అయిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఆ సినిమా తరువాత పాయల్ కి చెప్పొకోదగ్గ హిట్టు ఇప్పటిదాకా పడలేదు.

కాగా పాయల్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి మహాసముద్రం వంటి డిజాస్టర్ సినిమాతో డీలా పడి,

తరువాత పాయల్ తోనే లేడి ఓరియెంటెడ్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కించిన సినిమా మంగళవారం. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో గ్రాండ్ గానే తెరకెక్కించారు.

ఈ సినిమా నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్, టీజర్ కట్, సాంగ్స్, ట్రైలర్ లు ఈ సినిమా మీద ప్రేక్షకులలో ఒక్కసారిగా అంచనాలు పెంచేసాయి.

ఆ అంచనాలు ఈ సినిమా బుకింగ్స్ అండ్ ఓపెనింగ్స్ కి బాగా హెల్ప్ అయ్యాయి అని చెప్పుకోవచ్చు.

ఈరోజు (నవంబర్ 17) న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా అనుకున్నంత స్థాయిలో లేదని పబ్లిక్ టాక్ గా చెప్పేస్తున్నారు.

కథ గురించి మాట్లాడుతూ రెండు జంటలు మంగళవారం రోజునే చనిపోతాయి, వారి చావులకి పాయల్ కి సంబంధం ఏంటి అనేది కథ.

ఇది థ్రిల్లర్ స్టోరీ అయినప్పటికీ డైరెక్టర్ అజయ్ భూపతి హర్రర్ టచ్ ఇచ్చారు. కొన్ని సీన్స్ మాత్రమే థ్రిల్ కలిగించాయి, సెకండ్ హాఫ్ బాగా స్లోగా ఉంది.

సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి, పాయల్ నటన ఈ సినిమాలో కూడా చాలా బాగుంది.

ఈ పాత్రకు పాయల్ తప్ప మారేవారిని ఊహించలేము, తన కళ్ళతోనే కొంత సినిమాను లాగేసింది. సినిమాలో చాలా పాత్రలకు కరక్ట్ జస్టిఫికేషన్ జరగదు, లాజిక్స్ మిస్ అవుతారు, అనుకున్న స్థాయిలో అయితే సినిమా లేదు. కానీ టైమ్ పాస్ మూవీ అంటున్నారు పబ్లిక్ టాక్.

పబ్లిక్ ఈ సినిమాకు ఇచ్చిన రేటింగ్ – 2.5/5 Mangalavarm Film Review and Rating

ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పాయల్ ఎమోషనల్ అయ్యారు.

కొన్ని గంటల ముందే నేను ఈ సినిమా చూసా, ఇండస్ట్రీ కి వచ్చినప్పటి నుండి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నా, కష్టపడ్డా.. నన్ను ఇంతకాలం సపోర్ట్ చేసిన ప్రేక్షకులకి ఎప్పటికి ఋణపడి ఉంటా, ఈ మంగళవారం సినిమాను కూడా ఆదరించి నాకు మంచి విజయాన్ని అందించాలని కోరారు.

 

Also Read:క్రికెటర్లకు కాంట్రాక్టులు.. హైదరాబాదీలకు బొనాంజా

Latest News Of Dr.Chiranjeevi Gaaru Interview
Dr.Chiranjeevi Gaaru Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.