మంచు విష్ణు కన్నప్ప ఓటీటీలోకి రానుందా?

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’ ఈ సినిమా గత నెల 27న విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. విడుదల తర్వాత కూడా అంచనాలకు అనుగుణంగా మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై నెల కావొస్తున్న సందర్భంగా ఓటీటీలో విడుదలకు రంగం సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే విడుదల కానుందా? ఒకవేళ కాదంటే.. ఎప్పుడు విడదలవుతుందో తెలుసుకుందాం.

వాస్తవానికి ఈ సినిమా విడుదలకు ముందే ఓటీటీ హక్కులను అమ్మలేదని మంచు విష్ణు చెప్పాడు. బడ్జెట్ రూ.200 కోట్లు పెట్టినా.. సినిమా మంచి సక్సెస్ టాక్ సొంతం చేసుకున్నా కలెక్షన్స్‌ మాత్రం అంతంత మాత్రమే వచ్చినట్టు టాక్. కేవలం 40 – 50 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని చెబుతున్నారు. అలాగే ఈ సినిమా జూలై 27న స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *