Manchu Vishnu: ‘ఢీ’ సీక్వెల్ స్క్రిప్ట్ నా దగ్గరకు వస్తే..

తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ను పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాల్లో మంచు విష్ణు బిజీబిజీగా గడిపేస్తున్నాడు ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలు జోరుగానే ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే మంచు విష్ణు ‘ఢీ’ సీక్వెల్‌తో తనకు మదిలో ఉన్న మరో డ్రీమ్ ప్రాజెక్టు గురించి కూడా తెలిపాడు. ‘ఢీ’సీక్వెల్ కోసం తను.. ఆ మూవీ డైరెక్టర్ యత్నిస్తున్నామని.. తను ఆ చిత్రాన్ని ఎంతో ప్రేమతో చేశానని పేర్కొన్నాడు. ఏదో ఒక రోజు ‘ఢీ’ దర్శకుడు సీక్వెల్ స్క్రిప్ట్‌తో తనను కలవాలని కోరుకుంటున్నట్టు వెల్లడించాడు.

స్క్రిప్ట్ సిద్ధమైన వెంటనే షూటింగ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమని విష్ణు తెలిపాడు. ఇక తన మరో డ్రీమ్ ప్రాజెక్టు గురించి కూడా చెప్పాడు. 1947 నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ సినిమా చేయాలనే ఆలోచన తనకు ఎప్పటి నుంచో ఉందని.. దానిని మంచు విష్ణు వెల్లడించారు. ఆ ఆలోచనను నిజం చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అలాగే మరో సినిమా గురించి కూడా విష్ణు వెల్లడించాడు. ఫహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆవేశం’ సినిమా గతేడాది విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తెలుగు రీమేక్‌ చేయాలని అనుకున్నట్లు మంచు విష్ణు తెలిపాడు. మరి ఈ మూడు సినిాలను మంచు విష్ణు ఎప్పుడు ప్రారంభిస్తాడో చూడాలి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *