కన్నప్ప : రివ్యూ

చిత్రం: కన్నప్ప

విడుదల తేదీ: 27-06-2025
నటీనటులు: మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ముఖేష్ రుషి, శివబాలాజీ తదితరులు
దర్శకత్వం: ముఖేష్ కుమార్ సింగ్
నిర్మాత: మంచు మోహన్ బాబు
సినిమాటోగ్రాఫర్: షెల్డన్ చౌ
సంగీత దర్శకుడు: స్టీఫెన్ దేవస్సీ
ఎడిటర్: ఆంథోనీ గొన్సాల్వెజ్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన ‘కన్నప్ప’ చిత్రం ఇవాళ (జూన్ 27)న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుందా? తెలుసుకుందాం.

సినిమా కథేంటంటే..

మంచు విష్ణు కుమార్తెలు అవియానా , వివియానాలు శ్రీకాళహస్తి మహత్యం వివరిస్తున్న దృశ్యంతో సినిమా ప్రారంభమవుతుంది. అత్యంత పవిత్రమైన వాయులింగాన్ని పూజించే భాగ్యం ఒక్క మహాదేవశాస్త్రికీ ఉంటుంది. దానిపై కాలముఖ కన్ను పడుతుంది. వాయులింగాన్ని తీసుకొచ్చేందుకు తన తమ్ముడిని పంపిస్తాడు. అతడిని తిన్నడు చంపిస్తాడు. ఆ తరువాత కాలముఖ ఎంట్రీ.. అతడిని గూడెం ప్రజలంతా ఎలా ఎదుర్కున్నారు? తిన్నడు కన్నప్ప గా ఎలా మారాడు? అసలు గత జన్మలో తిన్నడు ఎవరనేదే కథాంశం.

సినిమా ఎలా ఉందంటే..

తొలి అర్ధ భాగమంతా నెమలి (ప్రీతి ముకుందన్)తో ప్రేమ, కాలముఖతో వైరం వంటి అంశాలతో నడిచింది. సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ అద్భుతంగా అనిపిస్తుంది. అక్కడి నుంచి కన్నప్ప అసలు స్టోరీ ప్రారంభమినట్టు అనిపిస్తుంది. సినిమాలో విజువల్స్ అద్భుతం. సినిమా లాస్ట్ 40 నిమిషాలు హైలెట్. అది లేకుంటే సినిమా గురించి మరోలా చెప్పుకోవాల్సి వచ్చేది. ఇది మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది.

ఎవరెలా చేశారంటే..

మంచు విష్ణు తిన్నడు పాత్ర లో జీవించాడు. మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు అదరగొట్టేశాడు. ప్రభాస్ సినిమాకే ప్రాణం పోశాడు. శరత్ కుమార్ అద్భుతంగా నటించారు. మోహన్ లాల్ పాత్ర నిడివి తక్కువైనా గుర్తుండిపోయే పాత్ర చేశారు. అక్షయ్ కుమార్, కాజల్, ప్రీతి తదితరులు చక్కగా నటించారు.

ప్లస్ లు..

ప్రభాస్
మంచు విష్ణు నటన
మ్యూజిక్

మైనస్..

గ్రాఫిక్ వర్క్

కన్నప్ప మూవీలో రొమాంటిక్ సాంగ్స్

ఫైనల్ vardict..

శివయ్య భక్తులకు మహా ప్రసాదం

రేటింగ్‌– 3.25/5

ప్రజావాణి చీడిరాల

 

Also Read This :ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయితే ఇండస్ట్రీ నుంచి నిషేధం..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *