‘శుభం’ సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ టాక్‌తో నడుస్తోంది. సమంత స్వీయ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా సక్సెస్‌తో ఆమె ఫుల్ ఖుషీగా ఉంది. ఈ క్రమంలోనే సమంత కొన్ని ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. వాటిలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తీసుకున్న పిక్ కూడా ఒకటి. ఈ పిక్ చూసిన ఆంగ్ల మీడియా వీరిద్దరి గురించి రకరకాల కథనాలను ప్రచారం చేస్తోంది. భవిష్యత్‌లో సమంత, రాజ్ నిడిమోరు కలిసి అడుగు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ.. ఇప్పటికే ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చేశారంటూ ఆంగ్ల మీడియా కోడై కూస్తోంది. దీనిపై సమంత మేనేజర్ తాజాగా స్పందించారు. అవన్నీ రూమర్స్ మాత్రమేనని ఖండించారు.
సామ్, రాజ్ నిడిమోరు రిలేషన్‌షిప్ గురించి కథనాలు రావడానికి ఆమె షేర్ చేసిన పిక్ ఒక్కేట కారణం కాదు. ‘శుభం’ సినిమాకు సమంత నిర్మాతగా వ్యవహరించగా.. రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అంతకు ముందు రాజ్ – డీకే సంయుక్తంగా రూపొందించిన ‘ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’, ‘సిటాడెల్’ వెబ్ సిరస్‌లలో సమంత నటించిన సంగతి తెలిసిందే. వరుసగా అన్ని ప్రాజెక్టుల్లోనూ వీరిద్దరూ కలిసి నటించడంతో రూమర్స్ వస్తున్నాయి. మొత్తానికి సమంత మేనేజర్ దీనిపై స్పందించి రూమర్స్‌కు చెక్ పెట్టేశారు.